Share News

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:02 AM

: రాష్ట్రవ్యాప్తం గా ఉన్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీకోసం మే 16 నుంచి 23 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌ ప్రవేశపరీక్షా ఫలితాలను మంగళవారం విజయవాడలో రాష్ట్ర ఉన్న త విద్య ప్రధాన కార్యదర్శి జె.శ్యామలరావు విడుదలచేసినట్లు సెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు.

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

కాకినాడ జిల్లాలో ఇంజనీరింగ్‌లో 6,495 మంది విద్యార్థుల అర్హత

అగ్రికల్చర్‌ ఫార్మసీలో అర్హులైన 2,873 మంది విద్యార్థులు

జేఎన్టీయూకే, జూన్‌ 11: రాష్ట్రవ్యాప్తం గా ఉన్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీకోసం మే 16 నుంచి 23 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌ ప్రవేశపరీక్షా ఫలితాలను మంగళవారం విజయవాడలో రాష్ట్ర ఉన్న త విద్య ప్రధాన కార్యదర్శి జె.శ్యామలరావు విడుదలచేసినట్లు సెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడ జిల్లాలో మూడు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు ఇంజనీరింగ్‌ విభాగంలో 4,437మంది బాలురు హాజరు కాగా3,412మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 3,869 మందికిగాను 3083మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అగ్రికల్చర్‌ ఫార్మసీ విభాగంలో జిల్లాలో 715మంది బాలురు హాజరుకాగా 612మంది, 2621మంది బాలికలు హాజరుకాగా 2261 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 6,459మంది విద్యార్ధులు ఇంజనీరింగ్‌ విభాగంలో హాజరుకాగా 5,425మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. అగ్రికల్చర్‌ ఫ్మార్మసీ విభాగంలో 2,557మంది హాజరుకాగా 2,269మంది అర్హులయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మొత్తం 3,040మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ వి భాగంలో హాజరుకాగా 2,330మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. అగ్రికల్చర్‌ ఫార్మసీ విభాగంలో 1,244మంది హాజరుకాగా 1,115మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

జిల్లాల్లో ఉత్తమ ర్యాంకులు

కాకినాడ జిల్లాలో ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో మారిశెట్టి సాయిచరణ్‌ 22వ ర్యాంకును, గొల్లపల్లి ఫణీంద్ర 47వ ర్యాంకును, బిక్కిన రోహిత్‌చౌదరి 57వ ర్యాంకు ను, అంగాడి చరణ్‌ఉమేష్‌ 112, ఎం.విశ్వజ్‌ 129, ఎంబీఎస్‌ అరవింద్‌ 153, ఎం.విశ్వక్‌ 166, సీహెచ్‌ శ్రీకర్‌ 170, సీహెచ్‌ఆర్‌ ఎన్‌ తేజ 201, ఏహెచ్‌ఎస్‌ నిహాంత్‌ 205 ర్యాంకులు సాధించారు.

ఫ తూర్పుగోదావరి జిల్లాలో బి.రఘురామసహన్‌ 25వ ర్యాంకును, పీవీఎస్‌డీ సాయిమోహిత్‌ 40, జిసత్యనారాయణ 56, ఆర్‌.పవిత్ర 74, కె.ప్రవీణ్‌ సిద్దార్ధ 76, పీఎన్‌ఎస్‌ సత్య 147, కేఎస్‌. ప్రణవ్‌ 159, ఎస్‌డీవీ సతీష్‌ 165, కేఎస్‌టీ అనురూప్‌ 189, ఎం.మణికంఠ 200 ర్యాంకులను పొందారు.

ఫ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బి.సాయినరెన్‌ 51, బీకే సువర్ణ్‌ 100,ఎంజీవీ మహేష్‌ 105, కేఎస్‌పవన్‌ 185, వి.సహంత్‌ 187,జీఎన్‌వీ దుర్గాసాయి 240,సీహెచ్‌ఎస్‌ఎం వర్మ397, వైఎస్‌ఆర్‌ కార్తీక్‌ 444, ఎస్‌ఏ సుల్తానా 477, బీఎస్‌డీ మహేష్‌ 523 ర్యాంకులను సాధించారు.

ఫ కాకినాడ జిల్లాలో అగ్రికల్చర్‌ ఫార్మసీ విభాగంలో కాకినాడ శ్రీనగర్‌కు చెందిన దామిశెట్టి సిద్దార్ధ 11వ ర్యాంకును, పిఠాపురంనకు చెందిన నిమ్మకాయల హెచ్‌డీ శర్వణసత్యరవికిరణ్‌ 13వ ర్యాంకును, కాకినాడ వెంకటేశ్వరనగర్‌కు చెందిన యండమూరి నమితరాణి 31వ ర్యాంకును, చీడిగకు చెందిన కొత్తలంక సాయిబాలత్రిపురసుందరి 67వ ర్యాంకును, కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన ఎం.విశ్వంత్‌ 79వ ర్యాంకును, చిత్రాడకు చెందిన టి.జనన్య 97వ ర్యాంకును, డి.నవీన్‌తేజ 113, ఆర్‌ఎంఎస్‌ఎస్‌ రామగోపాల్‌ 114, పి.స్వర్ణాంజలి 128, వి.అభిశ్యామ్‌ 195 ర్యాంకులను కైవసం చేసుకున్నారు.

ఏపీ ఈఏపీసెట్‌-2024లో

సత్తా చాటిన తిరుమల విద్యార్థులు

రాజమహేంద్రవరంరూరల్‌ జూన్‌11: ఏపీ ఈఏపీసెట్‌-2024 పరీక్షా ఫలితా ల్లో రాజమహేంద్రవరంరూరల్‌ మండలం కాతేరులోని తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్‌లు సాధించారు. అగ్రికల్చర్‌లో ఎన్‌.రాధాకృష్ణ, 10వ ర్యాంక్‌, పీఎస్‌ సంపత్‌నాయుడు 28వ ర్యాంక్‌, డి.ప్రభాస్‌ 41వ ర్యాంక్‌, ఎస్‌.సాకేత్‌ రాఘవ 43వ ర్యాంక్‌, జి.సాయికృష్ణశ్రీ 64వ ర్యాంక్‌, పి.బేబిఅభిఘ్న 87వ ర్యాంక్‌, డి.తేజశ్విని 96వ ర్యాంక్‌, టి.జనన్య 97వ ర్యాంక్‌, ఆర్‌ఎల్‌ నాగవెంకట దుర్గాప్రసా ద్‌ 100వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారని తెలిపారు. వెయ్యిలోపు ర్యాంక్‌లను 60 మంది, 2వేలలోపు ర్యాంక్‌లను 90మంది, 5వేలలోపు ర్యాంక్‌లను 197 మంది, పదివేలలోపు ర్యాంక్‌లను 311మంది సాధించారు. ఇంజనీరింగ్‌లో 51వ ర్యాంక్‌ను బి.సాయినరేన్‌, 56వ ర్యాంక్‌ను జి.సత్యనారాయణ, 74వ ర్యాంక్‌ను ఆర్‌.పవిత్ర, 76వ ర్యాంక్‌ను కె.ప్రవీణ్‌ సిద్ధార్థ్‌ సాధించారన్నారు. వెయ్యిలోపు 119 మంది, 2వేలలోపు 252 మంది, ఐదువేలలోపు 562 మంది, పదివేల లోపు 865మంది ర్యాంక్‌లు సాధించారు. విద్యార్థులను, అధ్యాపకులను చైర్మన్‌ నున్నతిరుమలరావు, అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ శ్రీహరి అభినందించారు.

ఆదిత్య విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

కాకినాడ రూరల్‌, జూన్‌ 11: ఏపీఈఏపీసెట్‌-2024 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ప్రతిభ కనబరచి అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆదిత్య కార్యదర్శి ఎన్‌.కృష్ణదీపక్‌రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్‌ఫార్మసీలో ఎన్‌హెచ్‌డీఎస్‌ సత్యరవికిరణ్‌ రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు, వై.నైమితారాణి 31వ ర్యాంకు, కేఎస్‌బీ త్రిపురసుందరి 67, విప్పర్ల సృజన్‌ 76, మోటిపల్లి విశ్వంత్‌ 79వ ర్యాంకు సాధించారన్నారు. ఇంజనీరింగ్‌లో బి.రఘురామసహన్‌ 25వ ర్యాంకు, గొల్లపల్లి ఫణీంద్ర 47వ ర్యాంకు, బిక్కిన రోహిత్‌చౌదరి 57, బి.కల్కిసువర్ణ్‌ 100వ ర్యాంకు పొందినట్లు తెలిపారు. అగ్రికల్చర్‌ ఫార్మసీలో 114, 156, 198, 205 ర్యాంకులను ఇంజనీరింగ్‌లో 112, 129, 153, 166, 170 ర్యాంకులను సాధించారన్నారు. ప్రతిభ కనబరచి ఉత్తమర్యాంకులు సాధించిన విద్యార్ధులను ఆదిత్య చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, డైరెక్టర్లు లక్ష్మీరాజ్యం, శృతి, సుగుణ, ప్రిన్సిపాల్‌ మొయినా తదితరులు అభినందించారు.

Updated Date - Jun 12 , 2024 | 07:44 AM