వైసీపీ హయాంలో సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:47 AM
రాజోలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.40వేల కోట్లు పక్కదారి పట్టాయని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారి జిల్లాకు విచ్చేసిన ఆమెకు ఎన్డీఏ నాయకులు ఎమ్మార్పీఎస్, ఎ

రాష్ట్ర మాదిగ కార్పొరేషన్
చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి
రాజోలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.40వేల కోట్లు పక్కదారి పట్టాయని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారి జిల్లాకు విచ్చేసిన ఆమెకు ఎన్డీఏ నాయకులు ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ అనుబంధ సంఘాల నాయకులు డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో శుక్రవారం ఘన స్వాగతం పలికారు. శివకోడులో శ్రీమంగెన గంగయ్య తెలగా కల్యాణ మ ండపంలో జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలకు ఎస్సీ కార్పొరేషన్, విదేశీ విద్య వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌లు ఇచ్చిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. జగన్ పదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, వైసీపీ విద్యుత్ చార్జీలపై ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సహకార సంఘం కార్యనిర్వాహక సంచాలకులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం అమలవుతున్న ఉన్నతి పథకాలు, త్వరలో అమలయ్యే ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక, ఇ-ఆటోలు, షాపింగ్ కాంప్లెక్సులు, పౌల్ర్టీ కాంప్లెక్సులు, ఎన్‌ఎస్‌ఎఫ్ డీసీ, ఎన్‌ఎస్కే ఎఫ్‌డీసీ రికవరీలపై సమీక్ష చేపట్టారు. నిరుపేదలైన ఎస్సీ లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు మెరుగైన సేవలు అందించడం ద్వారా పథకాలు అమలు చేయడంలో చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉన్నతి పథకం ద్వారా కాకినాడ జిల్లాలో 67 మందికి 69.50లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో 74 మందికి రూ.92.50లక్షలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 89 మందికి రూ.76.50లక్షలతో ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీదేవి దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎమ్మెస్పీ అధికార ప్రతినిధి ఎన్.సత్యనారాయణ, శెట్టెం శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎస్సీ డైరెక్టర్లు వల్లూరి రాజా, ఎం.చంద్రశేఖర్, జె.సత్యవతి,కార్పొరేషన్ సిబ్బంది తదితరులున్నారు.