Share News

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌ పర్యటన

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:05 AM

పిఠాపురం రూరల్‌, జూలై 27: పిఠాపురం మండలం చిత్రాడ, కుమారపురం, ఎఫ్‌కేపాలెం, కందరాడ గ్రామాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌ మైలవరపు కృష్ణతేజ శనివారం పర్యటించారు. చిత్రాడను ఓవర్‌హెడ్‌ రిజర్వాయర్‌, గ్రామ సచివాలయాన్ని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించి రూప్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ కట్టడాన్ని పరిశీలించారు. చిత్రాడలో సర్వీసు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ సునీత, గ్రామస్తులు కో

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌ పర్యటన
కొత్తపల్లి మండలం వాకతిప్పలో మంచినీటి పథకాన్ని పరిశీలిస్తున్న కృష్ణతేజ

పిఠాపురం రూరల్‌, జూలై 27: పిఠాపురం మండలం చిత్రాడ, కుమారపురం, ఎఫ్‌కేపాలెం, కందరాడ గ్రామాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌ మైలవరపు కృష్ణతేజ శనివారం పర్యటించారు. చిత్రాడను ఓవర్‌హెడ్‌ రిజర్వాయర్‌, గ్రామ సచివాలయాన్ని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించి రూప్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ కట్టడాన్ని పరిశీలించారు. చిత్రాడలో సర్వీసు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ సునీత, గ్రామస్తులు కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుమారపురంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నూ తనంగా ఇచ్చిన పట్టాలు ప్రాంతంలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలని కాలనీ వాసులు కృష్ణతేజను కోరారు. ఎఫ్‌కేపాలెం, కుమారపురం, కందరాడల్లో గ్రామ సచివాలయాలను ఆయన సందర్శించారు. సచివాలయాల పనితీరు, ఉన్న సిబ్బం ది, వారికి అప్పగించిన బాధ్యతలు తదితర అం శాలు డీఎల్‌డీవో నారాయణమూర్తి వివరించారు. ఆయన వెంట సివిల్‌ సప్లైస్‌ డీఎం బాలసరస్వతి, ఎంపీడీవో చిన్నారావు, పంచాయతీరాజ్‌ డీఈఈ వెంకటేశ్వరరావు, ఏఈ నూకరాజు, జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

కొత్తపల్లి: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌ మైలవరపు కృష్ణతేజ కొత్తపల్లి మండలం వాకతిప్పలో నాగులాపల్లి ఏరియా సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. తాగునీటి పథకం ద్వారా సరఫరా అవుతోన్న గ్రామాలు, పథకం నిర్వహణపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను అడిగి తెలుసుకుని మెరుగైన నిర్వహణపై అధికారులకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్‌ జ్యోతుల శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు వాసంశెట్ట శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గుండా అప్పారావు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌ మైలవరపు కృష్ణతేజకు ప్రత్తి పాడు మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీ సమస్యలు పలువురు వివరించారు. ధర్మవరం సమీపంలోని వన్నెపూడికి విచ్చేసిన కృష్ణతేజను ధర్మవరానికి చెందిన బీజేపీ మండల ఉపా ధ్యక్షుడు ఊటా వీరబాబు, రామకుర్తి సూర్యనారాయణ గ్రామంలో డ్రైన్‌లు, రహదారులు, వి ద్యుత్‌ వైర్లు, స్తంభాలు వంటివి ఏర్పాటు చేయక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

Updated Date - Jul 28 , 2024 | 12:05 AM