Share News

అన్నవరంలో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్దం

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:06 AM

అన్నవరం, జనవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5గంటలకు స్వా మి,అమ్మవార్లను పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వార్షిక కల్యాణవేదిక వద్దకు తోడ్కొనివచ్చి పండితులు ప్రత్యేకపూజలు నిర్వహించి భోగిమం

అన్నవరంలో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్దం
ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఈవో రామచంద్రమోహన్‌

అన్నవరం, జనవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5గంటలకు స్వా మి,అమ్మవార్లను పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వార్షిక కల్యాణవేదిక వద్దకు తోడ్కొనివచ్చి పండితులు ప్రత్యేకపూజలు నిర్వహించి భోగిమంటను వెలిగిస్తారు. ఈ సందర్భంగా ఆలయప్రాంగణాన్ని పూర్తిగా పల్లెటూరి వాతావరణంగా తీర్చిదిదారు. తాటిచెట్లు, కుమ్మరికుండలు, నేలబావి, గడ్డిమేటు, ఎడ్లబండి, పిండివంల తయారీ, చిన్నారులకు భోగిపళ్లు వేయడం, కోడిపుంజులు తదితరవాటిని ఏర్పాటుచేయడంతో పాటుగా జంగమదేవర, బుడబుక్కలవేషదారణ, హరిదాసులు తదితర కళాకారులతో విన్యాసాలు ఏర్పాటు చేశారు. వాటిని శనివారం ఈవో రామచంద్రమోహన్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Jan 14 , 2024 | 12:06 AM