Share News

ఐదేళ్లు.. నోట్లోకి వెళ్లనివ్వలేదు!

ABN , Publish Date - May 27 , 2024 | 12:06 AM

జగన్‌ అంటే..విధ్వంసానికి చిరునామా.. సరిగ్గా ఐదేళ్ల కిందట ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన విధ్వంసం.. రూ. 5లకేఅందరికీ అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను మూసివేసే స్థాయికి తీసుకెళ్లింది.. రూ. 5లకే పేదోడికి అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లు గత ఐదేళ్లుగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయాయి..

ఐదేళ్లు.. నోట్లోకి వెళ్లనివ్వలేదు!
రాజమహేంద్రవరంలో అధ్వానంగా తయారైన అన్న క్యాంటీన్‌

అన్న క్యాంటీన్లు మూసివేయించిన జగన్‌

ఐదేళ్లుగా తెరుచుకోని వైనం

ఆకలితో అలమటించిన ప్రజానీకం

అయినా కనికరించని సీఎం

అధ్వానంగా తయారైన భవనాలు

అయినా పట్టించుకోని అధికారులు

బాబు వస్తే తెరుస్తారని ఎదురుచూపులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జగన్‌ అంటే..విధ్వంసానికి చిరునామా.. సరిగ్గా ఐదేళ్ల కిందట ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన విధ్వంసం.. రూ. 5లకేఅందరికీ అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను మూసివేసే స్థాయికి తీసుకెళ్లింది.. రూ. 5లకే పేదోడికి అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లు గత ఐదేళ్లుగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయాయి.. ఏకంగా రూ.25 లక్షలతో నిర్మించిన భవనాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి.. మళ్లీ బాబు వస్తారని.. అన్న క్యాంటీన్లు తెరిచి రూ. 5లకే కడుపునిండా అన్నం పెడతారని పేదలు ఎదురుచూస్తున్నారు.

‘ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత ఏ పార్టీ అధి కారంలోకి వచ్చినా ప్రజల సంక్షేమం కోసం పనిచేయా లి’.. ఇవి రాజనీతిజ్ఞులు, అనుభవం ఉన్న రాజకీయ నేత లు నమ్మే మాటలు. కానీ ఏ అనుభవమూ లేని జగన్‌ ఐదేళ్ల పాలన పగతో గడిచిపోయింది. చివరకు పేదల పట్టెడన్నాన్నీ వదల్లేదు. రోజూ వందలాది మంది పేదల ఆకలి తీరుస్తున్న ‘అన్న కేంటీన్ల’ను నిర్ధాక్ష ణ్యంగా మూత వేయించారు. ప్రత్యామ్నాయంగా ఏదోక పేరుతో పేదలకు ఆహారం అందించే ఏర్పాటు చేయండి మహా ప్రభో అని మొరపెట్టుకున్నా జగన్‌ మనసు ఐదే ళ్లుగా కరగలేదు. పేదల కడుపు నింపలేని పాలకులు ఉంటే నేమి.. ఊడితేనేమి!.. అంటున్నారు జనం.

ఆకలి తీర్చిన అన్న కేంటిన్లు

2013లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్రంలో అమ్మ కేంటీన్లను ప్రారంభించింది. నామ మాత్రపు ధరకు పేదల కడుపు నిండేది. పేదలు, మధ్య తరగతి ప్రజల ఆదరణ బాగా ఉండడంతో చంద్రబాబు ఏపీ సీఎం అయిన తర్వాత మంత్రులను పంపించి ఆ పథకంపై అధ్యయనం చేయించారు. మన రాష్ట్రంలో కూడా అలాంటి సదుపాయాన్ని కల్పించాలని సంకల్పిం చారు. ముందుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతంలో మొదలుపెట్టారు. జనాదరణ విపరీతంగా ఉండడంతో రాష్ట్రమంతా ప్రారంభించారు. ముందుగా జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంతాలైన రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడ దవోలులో ఈ కేంటీన్లను ప్రారంభించారు. వివిధ పనులపై పట్టణాలకు వచ్చే వాళ్లకు సదుపాయంగా ఉండే విధంగా పేదలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో అన్న కేంటీన్లను నిర్మించారు. ఉదాహరణకు రాజమ హేంద్రవరంలో పేదలు నివసించే క్వారీ సెం టర్‌, ప్రజలు రోజూ వివిధ పనులపై వచ్చే మునిసి పాలిటీ బయట, ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో భవనానికి రూ.25 లక్షలు వెచ్చించి అన్న క్యాంటీన్లను అధునాతనంగా నిర్మించారు. ఆహారం దగ్గర నుంచి పరిసరాల వరకూ పూర్తి పరిశుభ్రంగా ఉండేవి. వడ్డించే వారు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కు, తలకు వస్త్రం ధరించేవారు. పేదలకు నామమాత్రపు ధరకు ఆహారం అందించేవారు. ఈ కేంటీన్లు మునిసి పల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసేవి. కేవలం రూ.5కే హాట్‌ ప్యాక్‌లలో ఉండే వేడి వేడి ఆహార పదార్థాలను వడ్డించేవారు. దీంతో ఆస్పత్రికి రోగుల కూడా వచ్చే సహాయకులు, రోగులు, ఆటో, రిక్షా తదితర కార్మికులకు ఆకలి తీరేది. ఉన్నత వర్గాల వాళ్లు ఈ అన్న క్యాంటీన్లలో తినడానికి ఏ మాత్రమూ సందేహించేవారు కాదు.

అదిరిపోయే మెనూ..

రూ.5కే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందుబాటులో ఉండేది. ప్రతి రోజూ ఇడ్లీ, చట్నీ/పొడి, ఉప్మా, పొంగల్‌, పూరి, కుర్మా ఇలా ఏదోక రెండు మూడు రకాల టిఫిన్స్‌ అందు బాటులో ఉండేవి. మధ్యాహ్నం, రాత్రి అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అందించేవారు. వారంలో ఒకరోజు స్పెషల్‌ రైస్‌ పేరుతో బిర్యానీ వంటివి వడ్డించేవాళ్లు. ఉదయం 7.30 గంటల మొదలుకొని రాత్రి 9 గంటల వరకూ అన్న ్జకేంటీన్‌ తెరిచి ఉండేది. రోజుకు ఒక్కో క్యాంటీన్‌లో సరాసరి 300 మంది వరకూ ఆకలి తీర్చుకునేవారు.

ఐదేళ్లూ మూసివేయించిన జగన్‌..

అన్న కేంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసి వేయ డంతో పేదల ఆకలి బాధను చూడలేక టీడీపీ నాయ కులు సొంతంగా అన్న కేంటీన్‌ పేరుతో ఆహారం అం దించే ఏర్పాటు చేశారు. రూ.5 ధర పెట్టినా.. డబ్బులు ఇస్తే తీసుకొనేవారు లేకపోతే అడిగేవాళ్లుకాదు. ఇది కూడా జగన్‌ జమానాకు గిట్టలేదు. అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తున్న టీడీపీ నాయకులను బెది రించడం, కేసుల్లో ఇరికించడం వంటివి చేశారు. రాజమహేంద్రవరం ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఏర్పాటు చేసిన అన్న కేంటీన్‌ను మూసివేయించారు. కొన్ని చోట్ల క్యాం టీన్లను ధ్వంసం చేసి పైశాచికానందం పొందారు. వేలాది మంది ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. గ్రానైట్‌ టేబుళ్లు, సింకులు, బాత్‌ రూమ్‌లు ధ్వంసమయ్యాయి. సీలింగ్‌ ఫ్యాన్లు ఇతర సామగ్రి మాయమయ్యాయి. అన్న కేంటీన్లను వైసీపీ ప్రభుత్వం దుస్థితిలోకి నెట్టడంతో దాతలు దయతలచి అన్నం పెట్టే వరకూ ప్లాట్‌ఫాంలపై ఎదురు చూస్తు న్నారు పాపం పేదలు ప్రతి పూటా ఆకలితో...!

బాబు వస్తారు.. కేంటిన్లు తెరుస్తారు..

ప్రస్తుతం ఎన్నికలు అయిపోయాయి.. ఈ నేపథ్యంలో బాబు రావాలి.. అన్న కేంటీన్లను తెరవాలి..మా ఆకలి తీర్చాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జూన్‌ 4వ తేదీ న కౌంటింగ్‌ కావడంతో మరో 8 రోజుల్లో ఫలితం తేల నుంది.ఈ నేపథ్యంలో మళ్లీ అన్న కేంటిన్లు అందు బా టులోకి వస్తాయని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - May 27 , 2024 | 12:06 AM