Share News

అన్న క్యాంటీన్లు విడుదల

ABN , Publish Date - Aug 06 , 2024 | 12:22 AM

అన్న క్యాంటీన్లకు స్వాతంత్య్రం వచ్చేసింది..ఐదేళ్ల తరు వాత విడుదలయ్యాయి.. గత టీడీపీ ప్రభుత్వంలో పేదల కడుపునింపిన అన్న క్యాంటీన్లకు వైసీపీ ప్రభుత్వంలో తా ళాలు పడ్డాయి..

అన్న క్యాంటీన్లు విడుదల
రాజమహేంద్రవరం అన్న క్యాంటీన్‌

2014లో పథకం ఆరంభం

2019 వరకూ ఆకలి తీర్చాయి

ప్రభుత్వం మారడంతో తాళాలు

పేదల కడుపుపై కొట్టిన జగన్‌

భవనాలు ఐదేళ్లూ మూతే

కూటమి రాకతో పునఃప్రారంభం

ఆగస్టు 15 నుంచి ఆరంభం

జిల్లాలో ఐదు ఏర్పాటు

రాజమహేంద్రిలో మూడు

కొవ్వూరు, నిడదవోలులో ఒక్కొక్కటి

శరవేగంగా సాగుతున్న పనులు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)/ రాజమహేంద్రవరం సిటీ

అన్న క్యాంటీన్లకు స్వాతంత్య్రం వచ్చేసింది..ఐదేళ్ల తరు వాత విడుదలయ్యాయి.. గత టీడీపీ ప్రభుత్వంలో పేదల కడుపునింపిన అన్న క్యాంటీన్లకు వైసీపీ ప్రభుత్వంలో తా ళాలు పడ్డాయి..ఐదేళ్లూ ఒక్క అన్న క్యాంటీన్‌ తెరవ లేదు. కక్ష సాధింపు దోరణితో మూసివేశారు. టీడీపీ నాయకులు అక్కడక్కడా అన్న క్యాంటీన్ల అంటూ బయటకొచ్చినా కేసు లు పెట్టి వేధించారు. ప్రభుత్వం మారడంతో అన్న క్యాం టీన్లు విడుదలయ్యాయి.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే మళ్లీ తెరుచుకోనున్నాయి.

2014లో అన్న క్యాంటీన్లు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు రూ.5లకే పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం సిద్ధంచేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేద ల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించా రు. అప్పట్లో వీటి నిర్మాణానికి ఒక్కొక్క దానికి సుమారు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చుచేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 వరకు పనిచేశాయి. లక్షలాది మంది ఆకలి బాదలు తీర్చాయి. అయితే ఆ తరువాత జగన్‌ ప్రభుత్వం అధికారం చేప ట్టడంతో మూతపడ్డాయి. ఐదేళ్లూ పాటు అన్న క్యాంటీన్లకు తాళాలు వేసే ఉంచారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ తాళాలు తెరుచుకున్నాయి. ఈనెల 15వతేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయి.

వైసీపీ పాలనలో మూత

రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల కోసం ఈ క్యాంటీన్లను ప్రా రంభించిన సంగతి తెలిసిందే. మార్కెట్‌లో కనీసం రోడ్డు పక్క దుకాణంలో ఇడ్లీ తినాలంటే కనీసం రూ.20 ఉండ వలసిందే. ఇదే ఓ మోస్తరు హోటల్‌లో రూ.35కు పైనే. నిత్యావసరాల ధరలు పెరగడంతో ఇష్టానుసారం ధరలు పెంచేసిన సంగతి తెలిసిందే.పట్టెడన్నం తినాలంటే కనీసం రూ.100 ఉండాలి.ఇ టువంటి పరిస్థితులను గమనించిన టీడీపీ అధినేత 2019 వరకూ రాష్ట్రంలో పేదల కోసం అన్నక్యాంటీన్లు నిర్వహించారు. కేవలం రూ.5కే టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ కూడా కేవలం రూ.10లకే అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద, పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, సాధారణ ప్రజల కు అందుబాటులో ఉండేవిధంగా అన్న క్యాంటీన్లు ఏర్పా టు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసేశారు. భవనా లు కూలగొట్టాలని ప్రయత్నించారు. కానీ టీడీపీ పోరాడి నిలబెట్టింది. కూటమి అధికారంలోకి రావడంతో పేదలకు రూ.5లకే మళ్లీ కడుపు నింపనుంది. ఎన్నికలకు ముందే చంద్ర బాబు అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నా రు.గత వైసీపీ హయాంలో పాడైన అన్నక్యాంటీన్లకు మళ్లీ మరమ్మతులు చేసి ముస్తాబు చేస్తున్నారు.ఈ నెల 10వ తేదీకి సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాలో ఐదు క్యాంటీన్లు

మునిసిపల్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీల ఆధ్వర్యంలో ఇవి సిద్ధమవుతున్నాయి.రాజమహేంద్రవరంలో ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రి వద్ద రూ.5.1 లక్షలతో మర మ్మతులు చేసి ముస్తాబు చేశారు.క్వారీ మా ర్కెట్‌లో రూ.7.9 లక్షలతో ముస్తాబు చేశా రు. ఆనం కళాకేంద్రం సమీపంలోని సుబ్రహ్మణ్య మైదానంలో రూ. 4.5 లక్షలతో ఖర్చుతో సిద్ధం చేశారు.కొవ్వూరు ఆర్‌టీసీ బస్టాండ్‌ ప్రాం గణంలో రూ.2.8 లక్షలతో సిద్ధం చేస్తున్నారు. ఇది ఇంకా పూర్తి కాలేదు.నిడదవోలు ఐదో వార్డులోని పంగిడిరోడ్డులో రూ.6.25 లక్షలతో సిద్ధం చేస్తున్నారు.ఇది ఇంకా పూర్తి కాలేదు. కానీ 10వ తేదీకి అన్ని సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశా లు జారీ చేసింది. పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Updated Date - Aug 06 , 2024 | 12:22 AM