పేదలకు..పట్టెడన్నం!
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:26 AM
అన్న క్యాంటీన్లు..తెలుగుదేశం ప్రభుత్వ హయా ంలో చంద్రబాబు ఆలోచనతో రోజూ వందల మంది పేదల ఆకలితీర్చిన అక్షయపాత్రలు. క్యాం టీన్‌లోకి వెళ్లి రూ.5 ఇస్తే శుచిగా.. శుభ్రంగా.. గౌర వంగా వేడివేడిగా భోజనం అందేది.అయితే వైసీపీ రాజకీయ కక్ష పేదలకు పెట్టే పట్టెడన్నాన్ని వద ల్లేదు.

పట్టెడన్నంపై గత పాలకుల పగ
రాజకీయ కక్షతో రగిలిన జగన్
నాడు వైసీపీ పాలనలో మూసివేత
చంద్రన్న రాకతో తెరిచే ఏర్పాట్లు
సెప్టెంబరు 21 నాటికి ప్రారంభం
రూ.5లకే టిఫిన్, భోజనం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
అన్న క్యాంటీన్లు..తెలుగుదేశం ప్రభుత్వ హయా ంలో చంద్రబాబు ఆలోచనతో రోజూ వందల మంది పేదల ఆకలితీర్చిన అక్షయపాత్రలు. క్యాం టీన్‌లోకి వెళ్లి రూ.5 ఇస్తే శుచిగా.. శుభ్రంగా.. గౌర వంగా వేడివేడిగా భోజనం అందేది.అయితే వైసీపీ రాజకీయ కక్ష పేదలకు పెట్టే పట్టెడన్నాన్ని వద ల్లేదు.జగన్ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను నిర్ధాక్షి ణ్యంగా మూసేశారు. ఆ భవనాలు ధ్వంస మయ్యే స్థితికి చేర్చారు.అయితే చంద్రబాబు సీఎంగా రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిగా పెట్టిన ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం కూడా ఒకటి.క్యాంటీన్లను పునఃప్రారంభించడా నికి 100 రోజుల ప్రణాళికతో అధికా రులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. చంద్ర బాబు ఆదేశాలతో పనులు ఆరంభించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లపై దృష్టిపెట్టారు.
నాడు తమిళనాడులో చూసి..
2013లో తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత ఆ రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభిం చింది. నామమాత్రపు ధరకు పేదల కడుపు నిండేది. పేదలు, మధ్యతరగతి ప్రజల ఆదరణ బాగా ఉండడంతో 2014లో చంద్రబాబు ఏపీ సీఎం అయిన తర్వాత మంత్రులను పంపించి ఆ పథకాన్ని అధ్యయనం చేయించారు. మన రాష్ట్రం లో కూడా అలాంటి సదుపాయాన్ని కల్పిం చాలని సంకల్పించారు. అన్న క్యాంటీన్ల పేరుతో పేదలకు నామమాత్రపు ధరకు ఆహారం అందించాలని ఆలోచన చేసిన తర్వాత ఒక్కో భవనానికి రూ.25లక్షలు వెచ్చించి అధునాతనంగా నిర్మించారు. వివిధ పనులపై పట్టణాలకు వచ్చే వాళ్లకు సదుపాయంగా ఉండే విధంగా పేదలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు రాజమహేంద్ర వరంలో పేదలు నివసించే క్వారీ సెంటర్, ప్రజలు రోజూ వివిధ పనులపై వచ్చే మునిసిపాలిటీ బ యట, ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్లు మునిసిపల్ కమిషనర్ స్థాయి అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేసేవి. కేవలం రూ.5కే హాట్ ప్యాక్‌లలో ఉండే వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించేవారు. దీంతో ఆస్పత్రికి రోగుల కూడా వచ్చే సహాయ కులతో పాటు ఆటో,రిక్షా తదితర కార్మికుల ఆకలి తీరేది.ఉన్నత వర్గాల వాళ్లు కూడా ఈ అన్న క్యాం టీన్లలో తినడానికి ఏ మాత్రమూ సందే హించే వారు కాదు.వీటిలో వాతావరణం అలా ఉండేది.
ఇదీ మెనూ..
రూ.15లకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందుబాటులో ఉండేది. ప్రతి రోజూ ఇడ్లీ, చట్నీ/పొడి, ఉప్మా, పొంగల్, పూరి, కుర్మా ఇలా ఏదోక రెండు మూడు రకాల టిఫిన్స్ అందుబాటులో ఉండేవి.మధ్యాహ్నం, రాత్రి అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అందించేవారు. వారంలో ఒకరోజు స్పెషల్ రైస్ పేరుతో బిర్యానీ వంటివి వడ్డిచేవాళ్లు. ఉదయం 7.30గంటల మొద లుకొని రాత్రి 9 గంటల వరకూ అన్న క్యాంటీన్ తెరిచి ఉండేది. రోజుకు జిల్లాలోని అన్న క్యాంటీన్లు సుమారు 1500 మంది ఆకలి తీర్చేవి. ఉదయం టిఫిన్, మధ్యా హ్నం,సాయంత్రం భోజనానికి కలిపి రూ.15 తీసుకొనేవాళ్లు. కానీ, వాస్తవ ఖరీదు రూ.73. ప్రభుత్వం రూ.58 భరించేది. ఉదయం టిఫిన్ రూ.18కి ప్రభుత్వం రూ.13,మధ్యాహ్న భో జనా నికి రూ.27.50కి రూ.22.50, రాత్రి భోజనానికి రూ.27.50కి రూ.22.50 ప్రభుత్వం చెల్లించేది.
వంద రోజుల ప్రణాళిక...
కూటమి ప్రభుత్వం రావడంతో అన్న క్యాం టీన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ 100 రోజుల్లోపు పున రుద్ధరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేశారు. దీని ప్రకారం ఈ నెల 15వ తేదీకి తమ పరిధి లోని క్యాంటీన్లను పరిశీలించి తాజా పరిస్థితి, ఫర్నిచర్ తదితర అవసరాలపై కమిషనర్లు ప్రభు త్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. 19వ తేదీలోపుగా పునరుద్ధరణకు సంబంధించి అంచ నాలు సిద్ధం చేస్తారు. జూలై నెలాఖరుకు క్యాం టీన్లకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆహారం సరఫరా చేసే ఏజెన్సీని ఖరారు చేస్తారు. ఆగస్టు 10వ తేదీనాటికి ఆయా ఏజెన్సీలకు ప్రభుత్వం అనుమతులిస్తుంది. 15వ తేదీకి కొత్త క్యాంటీన్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేస్తారు. సెప్టెంబరు 21కి అన్ని మునిసిపాలిటీలు, కార్పొ రేషన్లలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తారు. ప్రస్తు తం ఉన్న వాటితోపాటు మరిన్ని అన్న క్యాంటీన్లను అందు బాటులోకి తేనున్నారు.