జగ్గంపేటలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభం
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:38 PM
జగ్గంపేట, జూన్ 17: కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న క్యా ంటీన్‌ను పునఃప్రారంభమైం

జగ్గంపేట, జూన్ 17: కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న క్యా ంటీన్‌ను పునఃప్రారంభమైంది. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని వారాలు ఆగిన క్యాంటీన్‌ను సోమవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పునఃప్రారంభించారు. జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సాయంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్న దానం నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను టీడీపీ హయాంలో చంద్రబాబు ఏర్పాటు చేశా రని, కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని రద్దు చేయ గా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అ యిన తర్వాత అన్న క్యాంటీన్లను పునుద్ధరించా రని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు, రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి, సత్తి సదాశివరెడ్డి, జాస్తి వసంత్, భూపాలపట్నం ప్రసాద్, దాపర్తి సీతారామయ్య, వేములకొండ జోగారావు, బద్ది సురేష్, యల్లమిల్లి సీఎం, కింగం రమణ, నేదురి గణేష్, తోలుగంటి ప్రవీణ్ రెడ్డి, రాయిసాయి, అరటా పోలీస్, కురుమళ్ల నాగేశ్వరరావు, డేగల సత్తిబాబు ఉన్నారు.