Share News

అంగన్‌వాడీ సిబ్బందిపై ‘ఎస్మా’ అప్రజాస్వామికం

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:32 AM

జీవో నెంబరు-2 ద్వారా అంగన్వాడీల సమ్మెను అత్యవసర సర్వీస్‌ మెయింటెనెన్స్‌ చట్టం (ఎస్మా) కింద నిషేధించడం అప్రజాస్వామికమని, ఎస్మాను ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీ సిబ్బందిపై  ‘ఎస్మా’ అప్రజాస్వామికం
కొవ్వూరులో ఎస్మా కాపీలను దహనం చేస్తున్న అంగన్వాడీలు

  • పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమన్నారాయణ

  • ఎస్మా పత్రాలను దహనం చేసిన అంగన్వాడీలు

  • గోపాలపురంలో ఒంటి కాలిపై నిలబడి నిరసన

  • 26వ రోజు కొనసాగిన సమ్మె

కొవ్వూరు, జనవరి 6: జీవో నెంబరు-2 ద్వారా అంగన్వాడీల సమ్మెను అత్యవసర సర్వీస్‌ మెయింటెనెన్స్‌ చట్టం (ఎస్మా) కింద నిషేధించడం అప్రజాస్వామికమని, ఎస్మాను ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కనీసం వేతనం రూ.26 వేలు, గ్రాట్యూటీ అమలు చేయకుండా సమ్మెను ఎస్మాతో నిషేధించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం చట్టవ్యతిరేఖమైన పాలన కొనసాగిస్తూ నిరుద్యోగులైన అంగన్వాడీలు తమ న్యాయమైన కొర్కెల సాదనకై చేస్తున్న సమ్మెను ఉక్కు పాదంతో అణచివేయడాన్ని ప్రజా వ్యతిరేఖ చర్య అన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల బతుకు అత్యవసర మెయింటెనెన్స్‌గానే పరిగణించాలన్నారు. ఆర్టికల్‌ 21ను విస్మరించి వారిపై ఎస్మా ప్రయోగించడం అత్యంత ఘోరమన్నామన్నారు. చిరు ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడం చట్ట వ్యతిరేక పాలన కిందకు వస్తుందన్నారు.కొవ్వూరు, జనవరి 6: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకులు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా పత్రాలను అంగన్వాడీలు దహనం చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌ మాణిక్యాంబ ఆధ్వర్యంలో కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల చేపట్టిన సమ్మె శనివారం 26వ రోజుకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు, ఐఎఫ్‌టీయూ నాయకుడు సీహెచ్‌ రమేష్‌ మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మెచేస్తున్న అంగన్వాడీలను ఎస్మా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని, సమస్యలు పరిష్కరించకుండా సమ్మెను నిషేధిస్తూ, సమ్మె కాలానికి వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సీహెచ్‌ పుష్పావతి, బి.పద్మజ, బి.వసంత, సీహెచ్‌ బ్రహ్మమ్మ, వి.శ్రీదేవి, సీహెచ్‌ భవాని, కేఈ లక్ష్మి, జి.నేలమ్మ, డి.రమణ, వై.మధురవల్లీ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:32 AM