Share News

చలికి వణుకుతూ.. నడిరోడ్డుపై నిద్రించి అంగన్‌వాడీల 24 గంటల దీక్ష

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:48 AM

అయ్యో పాపం అంగన్‌వాడీలు.. ఒక పక్క చలి వణికిస్తున్నా తమ డిమాండ్ల సాధనకు 24 గంటల నిరవధిక దీక్షకు దిగారు.

చలికి వణుకుతూ.. నడిరోడ్డుపై నిద్రించి  అంగన్‌వాడీల 24 గంటల దీక్ష
ఆర్‌డీవో కార్యాలయం ఎదుట చలిలో టెంట్‌ కింద నిద్రపోయిన అంగన్‌వాడీలు

అయ్యో పాపం అంగన్‌వాడీలు.. ఒక పక్క చలి వణికిస్తున్నా తమ డిమాండ్ల సాధనకు 24 గంటల నిరవధిక దీక్షకు దిగారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం నుంచి తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళన చేశారు. సర్కారు దిగిరావాలి.. హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. సోమవారం అర్ధరాత్రి ఆర్‌డీవో కార్యాలయం ఎదుట అదే రోడ్డుపై ఇదిగో ఇలా పిల్లాపాపలతో చలికి వణుకుతూ నిద్రించారు.. ప్రభు త్వం దిగి వచ్చే వరకూ సమ్మె ఆపేది లేదని.. పోరాటం ఆపమని నినదించారు. - రాజమహేంద్రవరం అర్బన్‌

Updated Date - Jan 09 , 2024 | 12:48 AM