Share News

ఆంధ్రకేసరి సాహసం యువతకు స్ఫూర్తి

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:26 AM

దేశంకోసం తుపాకీ తూటా కు ఎదురుగా తన గుండెను నిలిపి ‘ఆంధ్రకేసరి’గా జేజేలు అందుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువతకు స్ఫూర్తి అని అడిషనల్‌ ఎస్పీ (పరిపాలన) ఎస్‌ఆర్‌ రాజశేఖర్‌ రాజు పేర్కొ న్నారు.

ఆంధ్రకేసరి సాహసం యువతకు స్ఫూర్తి

అడిషనల్‌ ఎస్పీ రాజశేఖర్‌ రాజు

రాజమహేంద్రవరం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): దేశంకోసం తుపాకీ తూటా కు ఎదురుగా తన గుండెను నిలిపి ‘ఆంధ్రకేసరి’గా జేజేలు అందుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువతకు స్ఫూర్తి అని అడిషనల్‌ ఎస్పీ (పరిపాలన) ఎస్‌ఆర్‌ రాజశేఖర్‌ రాజు పేర్కొ న్నారు. జిల్లా పోలీసు కార్యాల యంలో శుక్రవారం ప్రకాశంపంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం రాజశేఖ ర్‌రాజు మాట్లాడుతూ నిర్భీతి, నిజాయితీ, నిబద్ధత, పేదల క్షేమం కోసం పోరాడే తత్వం వంటి సుగుణాలే టంగుటూరిని ప్రజా జీవితంలో సింహంలా నెలబెట్టాయని కొనియాడారు. డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టంగు టూరి ప్రకాశం చిత్రపటానికి ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారా వు పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర కేసరి ఆశయాలను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు తవ్వల వీరేంద్రనాథ్‌, ఉపాధ్యక్షురా లు నాగదేవర స్వర్ణపాప, ప్రధాన కార్యదర్శి పెళ్లూరి రమేశ్‌ పాల్గొన్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులుకు ఘన నివాళి

రాజమహేంద్రవరంసిటీ/రూరల్‌: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు 153 జయంతిని శుక్రవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లో టంగుటూరి చిత్రపటానికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చిన్నరాముడు టంగుటూరికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ టంగుటూరి ప్రకాశం పంతులు సదా స్మరణీయులన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. కార్యాలయ ఇన్‌చార్జి అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ టంగుటూరి చిత్రపటానికి నివాళులర్పించారు. డాక్టర్‌ అభిషేక్‌రెడ్డి, డిప్యూటీ డెమో డాక్టర్‌ సత్యకుమార్‌ నల్లూరి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులుకు అధికారులు నివాళులర్పించారు.

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

రాజమహేంద్రవరం కల్చరల్‌, ఆగస్టు 23: పట్టుదలకు, ఽధైర్యానికి, త్యాగానికి ప్రతీకయైున టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ స్ఫూర్తిదాయక మని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక జేఎన్‌ రోడ్డులో ని ఏకేసీ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమానికి ఆయన విచ్చేసి ప్రకాశం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ జమ్మి రామారావు, ప్రిన్సిపా ల్‌ సుబ్రహ్మణ్యేశ్వరి, చైర్మన్‌ జెట్టి ప్రసాదరావు, వర్తక ప్రముఖులు అశోక్‌కుమా ర్‌ జైన్‌, దుర్వాసుల సత్యనారాయణమూర్తి, ఆర్‌.సాయిబాబా పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:26 AM