Share News

భగ్గుమన్న అనపర్తి

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:22 AM

అనపర్తి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు భగ్గుమ న్నారు. అధిష్ఠానం అన్యాయం చేసిందంటూ ఆవేశంతో ఊగిపోయారు.. అనపర్తి టిక్కెట్‌ బీజేపీకి వెళుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరగడంతో టీడీపీ కేడర్‌ ఆం దోళనకు దిగిన సంగతి తెలిసిందే.

భగ్గుమన్న అనపర్తి
పెట్రోల్‌ పోసుకున్న కార్యకర్తలను అడ్డుకుంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇతర నాయకులు

టీడీపీలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

నల్లమిల్లికే కేటాయించాలని డిమాండ్‌

పెట్రోల్‌ పోసుకుని ఇద్దరి ఆత్మహత్యాయత్నం

అడ్డుకున్న నల్లమిల్లి, నాయకులు

భారీగా రామవరం చేరుకున్న కార్యకర్తలు

కన్నీటిపర్యంతమైన పలువురు నాయకులు

నేడు కార్యాచరణ ప్రకటిస్తానన్న నల్లమిల్లి

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

అనపర్తి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు భగ్గుమ న్నారు. అధిష్ఠానం అన్యాయం చేసిందంటూ ఆవేశంతో ఊగిపోయారు.. అనపర్తి టిక్కెట్‌ బీజేపీకి వెళుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరగడంతో టీడీపీ కేడర్‌ ఆం దోళనకు దిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ అసమ్మతిని చల్లార్చకుండానే కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎక్స్‌ మిలట్రీ మ్యాన్‌ ఎం.శివరామకృష్ణంరాజు పేరును బుధ వారం అధికారికంగా ప్రకటించారు. దీనిపై అనపర్తి టీడీపీ కేడర్‌ మండిపడింది. మొదటి జాబితాలోనే అన పర్తి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామ కృష్ణారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. అనంతరం బీజేపీతో కూడా కూటమికి పొత్తుకుదిరింది. ఈ నేపథ్యంలో బీజేపీ అనపర్తి సీటు కావాలని పట్టుబట్టి తీసుకుంది. ఈ విషయాన్ని సుమారు ఐదు రోజులు ముందే పసిగట్టిన రామకృష్ణారెడ్డి నాయకత్వంలోని టీడీపీ తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది పార్టీలకు రాజీనామాలు చేశారు. అనపర్తి టిక్కెట్‌ బీజేపీ అభ్యర్థికి కేటాయించినట్టు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్‌ రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చి ఆందోళనకు దిగారు. ఆయనకే సీటు కేటా యించాలని డిమాండ్‌ చేశారు. 1978 నుంచి ఇక్కడ రెడ్డి సామాజికవర్గమే ఏ పార్టీ నుంచైనా పోటీ చేస్తోంది. ఎమ్మెల్యేలు అవుతున్నారు. ప్రస్తుతం క్షత్రియ వర్గానికి చెందిన కృష్ణంరాజుకు ఈ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఇక్కడ కూటమి అభ్యర్థి అయ్యారు. దీంతో బీజేపీ వర్గాలు, అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కానీ టీడీపీ క్యాడర్‌, రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ కృష్ణారెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తు న్నట్టు సమాచారం. జిల్లాలో బీజేపీకి రాజమహేంద్రవరం లోక్‌సభతో పాటు అనపర్తి అసెంబ్లీ కేటాయించినట్టు అయింది. రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. అధికారమే లక్ష్యంగా ముం దుకు వెళుతున్న కూటమి అనపర్తిలో ఏర్పడిన సమస్యను ఎలా అధిగమిస్తుందో మరి.

రామవరంలో టీడీపీ కార్యకర్తల ఆందోళన

అనపర్తి, మార్చి 27 : అనపర్తి అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయిస్తూ ప్రకటన రావడంతో టీడీపీ కార్య కర్తలు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.సీటు కేటాయింపు విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గం నలుమూలల నుంచి వందలాదిగా కార్యకర్తలు రామవరంలోని టీడీపీ నాయకుడు నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి నివాసానికి చేరుకున్నారు. పార్టీ తమ నాయకుడిని మోసం చేసిందంటూ ఆవేదన చెం దారు. అనపర్తికి చెందిన ఇరువురు కార్యకర్తలు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశా రు. టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రామకృష్ణారెడ్డి వారించి ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దన్నారు. పలువురు కార్యకర్తలు కన్నీటి పర్యంత మయ్యారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడారు. మనం ఘోరంగా మోసపోయామని.. ఏవిధం గా అర్థం చేసుకోవాలో తెలియడంలేద న్నారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో వైసీపీ అన్యాయాలను అక్రమా లను ఎదురిస్తూ ప్రాణాలొడ్డి పోరా టాలు చేశామని దీనికి ఇటువంటి గౌవరం లభిస్తుందని ఊహించలేద న్నా రు. తన తండ్రి మూలారెడ్డి ఆనారోగ్యం తో మంచాన ఉంటే కరోనాను కూడా లెక్క చేయ కుండా గ్రావెల్‌ కుంభకోణాన్ని బయట పెట్టానన్నారు.రాజకీయాలంటేనే ఇష్టంలేని తాను తన తండ్రి మూలారెడ్డి, అధినేత చంద్రబాబు కోరితేనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నా రు. అయితే చంద్రబాబు తన విషయంలో ఎం దుకు స్పందించలేదో అర్ధం కావడం లేదన్నారు. కార్యకర్తలు ఎటువంటి అఘూయిత్యాలకు పాల్పడ వద్దని గురువారం రామవరంలో సమావేశమై భవిష్యత్‌ కార్యా చరణపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందామన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీని వీడని నేతలు కూడా తనపై నమ్మకంతో టీడీపీలో చేరారని తన వెంట ఉన్న కార్యకర్తలకు తాను జవాబు దారీగా ఉంటానన్నారు.

ఇది నా జీవన్మరణ సమస్య

నేడు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా

నేను మోసానికి గురయ్యా. నాకు కార్యకర్తలే ము ఖ్యం.నియోజకవర్గంలోని కార్యకర్తలందరితోనూ గురువా రం చర్చించి అందరికీ అవసరమయ్యేటట్టు నిర్ణయం తీసుకుంటా.. కరోనా సమయంలో కూడా టీడీపీ ఆదేశాల మేరకు తన తండ్రి ఆరోగ్యం బాగాకపోయినా ప్రజల కోసం పనిచేశా. పార్టీ నియోజకవర్గంలోనే కాకుండా ఎక్కడకు వెళ్లిపనిచేయమన్నా చేశా. అనేక వీడియో కాన్ఫరెన్స్‌లు, మీటింగ్‌లలో చంద్రబాబు తన పేరు ప్రస్తావన తెచ్చి రామకృష్ణారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 181 మంది కార్యకర్తలపై కేసులు ఉన్నాయి. నాపైనా 37 కేసుల వరకూ ఉన్నాయి. నేను నా కార్యకర్తలను రక్షించుకోవాలి. దాని కోసం ఏ నిర్ణయం అవసరమైతే అదే తీసుకుంటా. ఇది నా జీవన్మరణ సమస్య.. నా కారుపైన దాడికి పాల్పడ్డారని ఇంటిపై దాడి చేశారు. నేను బతికి కార్యకర్తలను బతికించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కార్యకర్తలు ఆందోళన చెందవద్దు. ఆర్థికంగా బలంగా లేకపోవడమే నా బలహీనత. ఇంతవరకూ తనతో ఎవరూ కనీసం సంప్రదించలేదు.

- నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

Updated Date - Mar 28 , 2024 | 12:22 AM