అనపర్తి ఏరియా ఆసుపత్రి ఆసుపత్రి అభివృద్ధికి రూ. 5 లక్షల నజరానా
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:42 AM
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, ఆసుపత్రి పనితీరు, శుభ్రత పరిశుభ్రత వంటి ఆంశాలను పరిశీలించి ఉత్తమ ఆసుపత్రులుగా ఎంపికైన ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం నజరానా ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఒక బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి నివేదికను సమర్పించింది.

కాయకల్ప ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలోనే ఉత్తమ తృతీయ ఏరియా ఆసుపత్రిగా అనపర్తి
అనపర్తి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, ఆసుపత్రి పనితీరు, శుభ్రత పరిశుభ్రత వంటి ఆంశాలను పరిశీలించి ఉత్తమ ఆసుపత్రులుగా ఎంపికైన ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం నజరానా ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఒక బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి నివేదికను సమర్పించింది. దీనిలో భాగంగా ఏరియా ఆసుపత్రుల్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఆసుప త్రుల ఎంపికలో అనపర్తి ఏరియా ఆసు పత్రి తృతీయ స్థానం దక్కించుకుని రూ.5 లక్షల నజరానాను సాధించింది. ఏరియా ఆసుపత్రుల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి 97 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించి రూ.10 లక్షల నజరానాను సొంతం చేసు కుంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు ఏరి యా ఆసుపత్రి 96.43 పాయింట్లతో ద్వితీ య స్థానం సాధించి రూ.7.5 లక్షల నజ రానాను సొంతం చేసుకోగా అనపర్తి ఏరి యా ఆసుపత్రి 95.86 పాయింట్లు సాధిం చి తృతీయ స్థానం సాధించి రూ.5 లక్షల నజరానాను సాధించింది. నజరానాగా వచ్చిన నగదుతో ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేస్తారు.
తృతీయ స్థానం సాధించడం ఆనందంగా ఉంది
కాయకల్ప పథకంలో భాగంగా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను గుర్తించి నజరానాలు అందించే కార్యక్రమంలో అనపర్తి ఏరియా ఆసుపత్రికి తృతీయ స్థానం లభించడం ఆనందంగా ఉంది. నజరానాగా వచ్చిన రూ.5 లక్షలతో ఆసుపత్రిలో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తాం.