Share News

రైతులకు సొమ్ములివ్వకుండా..పట్టాలెలా ఇస్తారు..

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:06 AM

అనపర్తి తహశీల్దార్‌ కార్యాలయంలో డమ్మీ పట్టాలు తయారు చేస్తున్న అధి కారులు.. దీని వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ నిర్వహించి చర్యలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతులకు సొమ్ములివ్వకుండా..పట్టాలెలా ఇస్తారు..
అనపర్తి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కొప్పవరం రోడ్డులో బైఠాయించి డమ్మీ పట్టాల ప్రతులతో నిరసన తెలుపుతున్న రామకృష్ణారెడ్డి, పార్టీ శ్రేణులు

అనపర్తిలో డమ్మీ పట్టాల ప్రతులను దహనం చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి నిరసన

అనపర్తి, ఫిబ్రవరి 27 : అనపర్తి తహశీల్దార్‌ కార్యాలయంలో డమ్మీ పట్టాలు తయారు చేస్తున్న అధి కారులు.. దీని వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ నిర్వహించి చర్యలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అనపర్తి దేవీచౌక్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు మంగళవారం భారీ ర్యాలీ చేశారు.భూసేకరణకు ప్రపోజల్స్‌ పంపి రైతులకు సొమ్ములు చెల్లించకుండానే అదే సర్వే నెంబర్లతో పట్టాలు తయారు చేయడంపై మండిపడ్డారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పట్టాల డమ్మీ నకళ్ళను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం డమ్మీ పట్టాల తయారీపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు నకళ్ళను అనపర్తి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణికి అం దజేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ఏడాదిన్నర కిందట సేకరించిన భూమికి నేటికీ రైతులకు సొమ్ములు చెల్లించకుండా అవే సర్వే నెంబర్లతో ప్లాట్‌ నెంబర్లు, సరిహద్దులతో తయారు చేసిన పట్టాలు డమ్మీ కాకుండా మరేమవుతాయని ప్రశ్నిం చారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా వ్యవహరి స్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్య క్రమంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెం కటరామారెడ్డి, గొలుగూరి రామభాస్కరరెడ్డి, మామిడిశెట్టి శ్రీను,నూతిక బాబూరావు, ఒంటిమి సూర్యప్రకాష్‌, తమలం పూడి సత్తిరెడ్డి, పేరిశెట్టి లాలయ్య పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే సహా 30మందిపై కేసు

అనపర్తి తహశీల్దార్‌ కార్యాలయంలో డమ్మీ పట్టాలు తయారవుతున్నాయని శనివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యాలయంలోకి ప్రవేశించి అధికారుల విధులకు భంగం కలిగించారని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామరావు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి సహా 30 మందిపై వీఆర్‌వో రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు.ఇప్పటికే 37 అక్రమ కేసులు పెట్టారని దీంతో 38కు చేరాయన్నారు.

అనపర్తి డీటీ శశిధర్‌ రంగంపేటకు బదిలీ

అనపర్తి, ఫిబ్రవరి 27 : అనపర్తి తహశీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వ హిస్తున్న టి.శశిధర్‌ను రంగంపేట తహశీల్దార్‌ కార్యాలయ డీటీగా బదిలీ చేశారు. రంగంపేట తహశీల్దార్‌ కార్యాలయంలో డీటీగా విధులు నిర్వహిస్తున్న దొరకయ్యను అనపర్తి డీటీగా బదిలీ చేసినట్టు సమాచారం. గత రెండు రోజులు కిందట అనపర్తి తహశీల్దార్‌ కార్యాలయంలో కలకలం రేపిన డమ్మీ పట్టాల తయారీ కారణంగా ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తుంది.

మార్చి 1న ఎమ్మెల్యే ఇంటికెళ్లి అవినీతిపై చర్చిస్తా

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి గత ఐదేళ్ల కాలంలో చేసిన 500 కోట్ల అవినీతిపై బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తేదీ సమయం చెప్పి రావాలని ఎమ్మెల్యే కోరిక మేరకు మార్చి 1వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చకు ఎమ్మెల్యే నివాసానికి వెళతానన్నారు. ఎమ్మెల్యే చేసిన అవినీతిపై ఆధారాలతో సహా వస్తానని ఎక్కడ అవినీతికి పాల్పడిందీ ముందుగానే ఎమ్మెల్యేకు తెలిజేసి చర్చకు వస్తానన్నారు. తాను చర్చించే అంశాల వివరాలను ముందుగానే వెల్లడిం చడానికి సిద్ధంగా ఉన్నానని..ఎమ్మెల్యే ఎవరిని పంపినా వివరాలు అందిస్తానన్నారు. చర్చకు సిద్దమంటూ ప్రగ ల్బాలు పలికిన నాయకుడు విషయాన్ని అప్పుడే రాష్ట్ర పోలీసు ఉన్నాతాధికారులకు, జిల్లా పోలీసు ఉన్నతాధికా రులకు వివరించి పోలీసు బందోబస్తు కోరుతున్నారని తనకు బందోబస్తు అవసరంలేదని అవినీతిని నిరూపించేం దుకు ధైర్యంగా వస్తానని రామకృష్ణారెడ్డి అన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం సవాళ్లతో మార్చి 1న అనపర్తిలో ఏం జరగబోతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 01:06 AM