అమిత్‌షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:24 AM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవహేళన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండు చేస్తూ వామపక్షాలు, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.

అమలాపురం టౌన్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవహేళన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండు చేస్తూ వామపక్షాలు, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే ఆలోచనతోనే అంబేడ్కర్‌ను అవమానిస్తుందని నాయకులు ధ్వజమెత్తారు. కలెక్టర్ మహేష్‌కుమార్‌కు అర్జీ అందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, దళిత ఐక్యవేదిక కన్వీనర్ జంగా బాబూరావు, కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొప్పుల సత్తిబాబు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొలమూరి మోహన్‌బాబు, గెడ్డం సురేష్‌బాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి టి.నాగవరలక్ష్మి, శెట్టిబత్తుల తులసీరావు, గోగి మురళి, మోకా శ్రీను, లావణ్య తదితరులు పాల్గొన్నారు.