ఆదర్శనీయుడు అంబేడ్కర్
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:42 AM
దేశ ప్రజలందరికి అంబేడ్కర్ ఆదర్శనీయుడని కలెక్టర్ మాధవీలత అన్నారు. సామాజిక సంకల్ప కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జీవిత విశేషాల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
రాజమహేంద్రవరం సిటీ,జనవరి 17: దేశ ప్రజలందరికి అంబేడ్కర్ ఆదర్శనీయుడని కలెక్టర్ మాధవీలత అన్నారు. సామాజిక సంకల్ప కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జీవిత విశేషాల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను కలెక్టర్ మాధవీలత ప్రారంభించి మాట్లాడారు. అంబేడ్కర్ జననం, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం ,రాజ్యాంగ రచన వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఎంతో ఆసక్తిని కలిగించాయన్నారు. సీఎం జగన్ ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల విగ్రహం అంబేడ్కర్ సేవలకు ప్రతిరూపంగా నిర్మించి స్మృతివనాన్ని ప్రారంభించనున్నారని చెప్పారు. రెండు రోజుల పాటు అంబేడ్కర్ ఛాయా చిత్రాల ప్రదర్శన ఉంటుందన్నారు. జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ అంబేడ్కర్ భారతదేశానికి మార్గనిర్ధేశకులుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్‌శ్రీవాత్సవ్, డీఆర్‌వో జి.నరసింహులు,ఆర్‌డీవో చైత్రవర్షిణి, కేఆర్‌సీ డిప్యూటి నాయక్ , డీఎంహెచ్‌వో కె.వెంకటేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్ ఎం.సనత్ కుమారి, సీపీవో ఎల్ అప్పలకొండ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఎం.సందీప్ పాల్గొన్నారు.