Share News

లింగధారుల అలుగుల సంబరం

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:38 AM

మహాశివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకుని లింగధారులైన కరికాళ భక్తులు శుక్రవారం అలుగుల సంబరాలు నిర్వహించారు. యువ కుల రెండు బుగ్గలను కలిపిన అలుగులు(శూలాలు) ధరించి పరమశివుని స్మరిస్తూ ట్రాక్టర్లపై గ్రామోత్సవం నిర్వహించారు.

 లింగధారుల అలుగుల సంబరం
ఇమ్మిడివరప్పాడులో ట్రాక్టర్లపై అలుగులు ధరించి ఊరేగుతున్న యువకులు

అమలాపురం రూరల్‌, మార్చి 8: మహాశివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకుని లింగధారులైన కరికాళ భక్తులు శుక్రవారం అలుగుల సంబరాలు నిర్వహించారు. యువ కుల రెండు బుగ్గలను కలిపిన అలుగులు(శూలాలు) ధరించి పరమశివుని స్మరిస్తూ ట్రాక్టర్లపై గ్రామోత్సవం నిర్వహించారు. తరతరాలు నాటి ఆచారాన్ని. సంప్రదాయ బద్ధంగా ప్రతీ ఏటా రంగాపురం, ఇమ్మిడివరప్పాడు గ్రామాల్లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీరభద్రుని సంబరాలు కరికాళ భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆయా గ్రామాల్లోని స్థానిక వీరభద్రుని ఆలయాల వద్ద నుంచి అలుగులు ధరించిన యువకులను ట్రాక్టర్‌పై ఉంచి ఊరేగించారు. రాత్రి ఆల య ప్రాంగణాల్లో ఏర్పాటుచేసిన నిప్పుల గుండంలో నడి చి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ప్రభలను గ్రా మాల్లో ఊరేగించారు. అఖండ దీపారాధనలు చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 01:38 AM