సచివాలయంలో మద్యం బాటిళ్లు
ABN , Publish Date - Dec 16 , 2024 | 01:12 AM
రాజమహేంద్రవరం రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యం బాటిళ్లు బ్యాగ్‌లో పెట్టుకుని సచివాలయానికి తీసుకెళ్లిన ఘటన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామసచివాలయంలో జరిగింది. ఇద్దరు వీఆర్వోలు వారి క్యాబిన్‌లో మద్యం బాటిళ్లు క
ఇద్దరు వీఆర్వోల నిర్వాకం
రాజమహేంద్రవరం రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యం బాటిళ్లు బ్యాగ్‌లో పెట్టుకుని సచివాలయానికి తీసుకెళ్లిన ఘటన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామసచివాలయంలో జరిగింది. ఇద్దరు వీఆర్వోలు వారి క్యాబిన్‌లో మద్యం బాటిళ్లు కలిగి ఉన్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి వెళ్లి తనిఖీ చేయగా వాటిని రైతులు తెచ్చారని బుకాయించే ప్రయత్నం చేశారు. రైతులే మద్యం బాటిళ్లు తెచ్చి ఉంటే వారికి ఏ పని చేయడానికి వీఆర్వో లు మద్యం బాటిళ్లు లంచంగా తెప్పించుకున్నారో వారికే తెలియాలి. బాధ్యత గల వీఆర్వోలు మద్యం బాటిళ్లు కలిగి అది కూడా సచివాయలంలో ఉండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ విషయం తెలిసి తహశీల్దార్ వివరణ అ డిగినట్టు తెలిసింది. వీఆర్వోలపై కలెక్టర్ ఎ టువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.