Share News

కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:49 AM

రాష్ట్రంలో పరిపాలన మారాలని, దానికి అన్నివర్గాల ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని ఉత్తర కోస్తా ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు అన్నారు. శనివారం టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, సూరపనేని చిన్నిలను కలిసి ఎమ్మార్పీఎస్‌ నాయకులు తమ మద్దతు తెలిపారు.

కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలి
ఐక్యత అభివాదం చేస్తున్న చినసుబ్బారావు, అచ్చిబాబు, నాయకులు

  • ఎమ్మార్పీఎస్‌ ఉత్తర కోస్తా ఇన్‌చార్జి చిన్న సుబ్బారావు

కొవ్వూరు, ఏప్రిల్‌ 27: రాష్ట్రంలో పరిపాలన మారాలని, దానికి అన్నివర్గాల ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని ఉత్తర కోస్తా ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు అన్నారు. శనివారం టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, సూరపనేని చిన్నిలను కలిసి ఎమ్మార్పీఎస్‌ నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చిన్న సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దళితుల్లో 59 ఉప కులాలకు సంబంధించి అమలులో ఉన్న 27 పథకాలను రద్దు చేసి అన్యాయం చేశారన్నారు. విదేశీ విద్యకు అంబేడ్కర్‌ పేరును తొలగించి జగన్మోహనరెడ్డి పేరు పెట్టుకోవడం చాలా దురదృష్ట్టకరమన్నారు. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయాల్లో తమ వంతు వాటాను రద్దు చేశార న్నారు. జగన్మోహనరెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు దళితులంతా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో పాలన మారాలని, అందుకు అన్ని సామాజికవర్గాలు కూ టమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు సంక్షేమ పథకాలు అందాలంటే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు విజయానికి పాటుపడతామన్నారు. మాదిగ, మాల కులాలకు మేలు జరగాలని ప్రతి గ్రామం తిరుగుతున్నామన్నారు. కార్యక్రమంలో గెడ్డం వినోద్‌, ముప్పిడి డానియేలు, కొక్కిరిపాటి వెంకటేష్‌, మనెల్లి నాని, వరిగేటి కాంతరాజు, కొక్కిరిపాటి శ్రీహరి, పెనుమాక జయరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:49 AM