Share News

అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా యానాం ఉత్సవాలు

ABN , Publish Date - Jan 07 , 2024 | 02:00 AM

యానాం నియోజక వర్గంలో కొన్ని సంవత్సరా లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యానాం ప్రజాఉత్సవాలు ఇతర ప్రాంతాలకు అదర్శంగా నిలిచాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు.

అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా   యానాం ఉత్సవాలు

ఆట్టహాసంగా ప్రారంభమైన యానాం ప్రజా ఉత్సవాలు

ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

యానాం, జనవరి 6: యానాం నియోజక వర్గంలో కొన్ని సంవత్సరా లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యానాం ప్రజాఉత్సవాలు ఇతర ప్రాంతాలకు అదర్శంగా నిలిచాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. పుదుచ్చేరి పర్యాటకశాఖా, యానాం ప్రజలస్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రు. శనివారం సాయంత్రం స్థానిక పరిపాలనాధికారి మునిస్వామి అధ్య క్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్ల్లీప్రత్యేకప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరై ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి అనంతరం కార్యక్రమాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. 24సంవత్సరాలకు క్రితం యానాం ఫలపుష్ప ప్రదర్శన, 22 సంవత్సరాల క్రితం యానాం ప్రజాఉత్సవాలు ప్రారంభమయ్యాయని, అయి తే మధ్యలో రెండుసంవత్సరాలు కరోనా ఇతర కారణాలతో వాయిదా పడటంతో ప్రస్తుతం 22వ ఫలపుష్ప ప్రదర్శన, 20న యానాం ప్రజాఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. యానాంలో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాకే పుదుచ్చేరి, కారైకాల్‌, మహేలో ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించిందన్నారు. యానాం ఉత్సవాల ప్రేరణతోనే కోనసీమ, కాకినాడ, విశాఖఫట్నం బీచ్‌ ఉత్సవాలు ప్రారంభించారన్నారు. సంక్రాంతి ముందుగానే ఈ ఉత్సవాలతో యానాంలో పండుగ వాతావారణం తీసుకురావాలనే ఉద్ధేశంతో స్థానికంగా ఉన్న కళాకారులతోపాటు దేశ, విదేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలను ఇస్తున్నారన్నారు. అనంతరం మల్లాడని ఆర్‌ఎ మునిస్వామి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆరుల్‌ ప్రగాశం, ఎస్‌పి రఘునాయగం, వ్యవసాయశాఖ డీడీ శివ సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ హాజరుకాలేదు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ సందర్భంగా నిర్వహించిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముందుగా ఈ ఉత్సవాలను పురస్కరించిన శాస్ర్తీయ, సిని మా నృత్యపోటీలను నిర్వహించారు. ముఖ్యంగా విశాఖపట్నంకు చెందిన విక్టరీ ఈవెంట్‌మేకర్స్‌ అధినేత మేడిద విక్టర్‌ నేతృత్వంలో జబర్ధస్త్‌ ఫేమ్‌ వినోదిని, రాజమౌళి యాంకరింగ్‌ అందరినీ ఉత్తేజపరిచింది. ఒడిస్సా సంబల్‌పూరి ఫోక్‌డ్యాన్స్‌, ఫైకా నృత్య ప్రదర్శనలు, మిమిక్రీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభం

యానాం, జనవరి 6: స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో గత 21 సంవత్సరాలుగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న 22వ ఫలపుష్ఫ ప్రదర్శన ప్రారంభమైయింది. క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ప్రజాఉత్సవాలకు హాజరైన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఆర్‌ఎ మునిస్వామి, ఎస్పీ రఘునాయగం, వ్యవసాయశాఖ డీడీ శివ సుబ్రహ్మణ్యం తదితరులు హాజరై ఈ ఫలపుష్ఫ ప్రదర్శన ప్రారంభించి అనంతరం తిలకించారు. ఈ ప్రదర్శన శనివారం నుంచి సోమవారం వరకూ మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫలపుష్పప్రదర్శనలో స్థానిక వ్యాపార సంస్థలకు సంబంధించి స్టాల్స్‌ను ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jan 07 , 2024 | 02:00 AM