Share News

అన్ని ప్రాణులకు ప్రాణాన్ని ఇచ్చేది నీరు..

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:27 AM

అన్ని ప్రాణులకు ప్రాణాన్ని ఇచ్చేది నీరు.. నీడనిచ్చేది చెట్టు అని వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, రామన్‌ మెగసెసె అవా ర్డు గ్రహీత డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు. వర్శిటీలోని అలూమ్ని ఆడిటోరియంలో ప్రపంచ మడ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్టీయూకే, పీడబ్ల్యూసీడీఎఫ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘మడ అడవులు వారసత్వ సంపద పరిరక్షణ’ అనే అంశంపై శనివారం యూనివర్సిటీ క్యాం పస్‌ కళాశాలల విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.

అన్ని ప్రాణులకు ప్రాణాన్ని ఇచ్చేది నీరు..

నీడనిచ్చేది చెట్టు : రాజేంద్రసింగ్‌

జేఎన్టీయూకే, జూలై 27: అన్ని ప్రాణులకు ప్రాణాన్ని ఇచ్చేది నీరు.. నీడనిచ్చేది చెట్టు అని వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, రామన్‌ మెగసెసె అవా ర్డు గ్రహీత డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు. వర్శిటీలోని అలూమ్ని ఆడిటోరియంలో ప్రపంచ మడ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్టీయూకే, పీడబ్ల్యూసీడీఎఫ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘మడ అడవులు వారసత్వ సంపద పరిరక్షణ’ అనే అంశంపై శనివారం యూనివర్సిటీ క్యాం పస్‌ కళాశాలల విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. దీనికి పీడబ్ల్యూసీడీఎఫ్‌ సమన్వయకర్త పి.ఆదినారాయణ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిఽథిగా రాజేంద్రసింగ్‌, గౌరవ అతిఽథిగా ఇన్‌చార్జి వీసీ కేవీఎస్‌జీ మురళీకృష్ణ, అతిఽథులుగా రెక్టార్‌ కేవీరమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌. సుమలత, యూసీఈకే ప్రిన్సిపాల్‌ ఎంహెచ్‌ఎం కృష్ణప్రసాద్‌, సామాజిక కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ, పర్యావరణవేత్త రత్నం పా ల్గొన్నారు. రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ నీర్‌, నారీ, నారాయణ్‌ అనే నినాదాన్ని ఇస్తూ నీర్‌ అంటే జీవితం, నారీ అంటే సృష్టికర్త, నది అనగా నాగరికత, నారాయణ్‌ అనగా నరుని జీవన మార్గము అని వివరించారు. ఇన్‌చార్జి వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ వారసత్వ సంపద పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా కృషిచేయాలన్నారు. జేఎన్టీయూకే గ్రీన్‌ క్యాంపస్‌గా వెలుగొందేందుకు రాజేంద్రసింగ్‌ నీటి రీసైక్లింగ్‌కు, నాలుగు హెరిటేజ్‌ వృక్షాల పరిరక్షణకు నమూనాలు ఇచ్చారన్నారని తెలిపారు. బొలిశెట్టి సత్య నారాయణ మాట్లాడుతూ మడ అడవులు, హోప్‌ఐలాండ్‌ వల్ల కాకినాడ నగరం సంరక్షింపబడుతున్నదనే విషయాన్ని గ్రహించాలని కోరారు.

Updated Date - Jul 28 , 2024 | 08:34 AM