Share News

నేటి నుంచి ‘పొలం పిలుస్తోంది’

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:26 AM

వరి సాగులో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబ డులు సాధించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘‘పొలం పిలుస్తోంది’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నేటి నుంచి ‘పొలం పిలుస్తోంది’
వరి పొలం

ఇకపై వారంలో రెండు రోజులు నిర్వహణ

రాజానగరం, సెప్టెంబరు 23 : వరి సాగులో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబ డులు సాధించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘‘పొలం పిలుస్తోంది’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వారంలో ప్రతి మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించేలా ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలైన మత్స్య, ఉద్యాన, పట్టు, పరిశ్రమ,సేంద్రియ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు పొలంబాట పట్టే దిశగా ప్రభు త్వం సంకల్పించింది. ఆధునిక పంటలపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టడంతో పాటుగా సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నదాతలను కలిసి సాగు కష్టాలు తెలుసుకుని నూతన దిగుబడులపై అవగాహన కల్పిస్తారు. ఖరీఫ్‌, రబీ సాగుల్లో నాలుగు నెలల వం తున ‘‘పొలం పిలుస్తోంది’’ నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అధికా రులు రైతు వద్దకు వెళ్లి పంట పరిశీలనతో పాటు లోపాలు గుర్తిస్తారు. ఈ వివరాలు రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించనున్నారు. పంట దిగుబడి తగ్గడానికి కారణాలు తెలుసు కోవడం, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి భూసారం పెంచేలా సూచనలు చేయడం, భూసార కార్డుల పంపిణీ, తుంపర, బిందు సేద్యం పఽథకం దిశగా ప్రోత్స హించడం చేస్తారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ, రైతు మిత్ర సంఘాల ఏర్పాటు, వ్యవసాయ సంఘాల ద్వారా రుణాలు మంజూరు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న 14 శాఖల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచి ంచింది. రాజానగరం వ్యవసాయాధికారి షేక్‌ ఇమామి ఖాసిం మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 12:26 AM