Share News

సాగు..బాగు!

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:15 AM

మరో 48 గంటల్లో 2024 చరిత్రలో కలిసిపోతోంది.. మళ్లీ కొత్త ఏడాదిలో కొంగొత్తగా అడుగుపెట్టబోతు న్నాం.. మరి 2024 మిగిల్చిన జ్ఞాపకాలేంటి.. విషాదాలేంటి అని ఒకసారి చూస్తే.. వైసీపీ ఉన్నంత వరకూ ఒక లెక్క.. కూటమి వచ్చిన తరువాత మరో లెక్క అనేలా ఉంది పరిస్థితి..

సాగు..బాగు!
చేలో ఆనందంగా రైతన్న

కూటమి రాకతో తీరిన వర్రీ

ఉద్యాన పంటల ధరల రికార్డు

అడపాదడపా తుఫాన్‌లు

ముంచెత్తిన ఏలేరు

(అమలాపురం/రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి)

మరో 48 గంటల్లో 2024 చరిత్రలో కలిసిపోతోంది.. మళ్లీ కొత్త ఏడాదిలో కొంగొత్తగా అడుగుపెట్టబోతు న్నాం.. మరి 2024 మిగిల్చిన జ్ఞాపకాలేంటి.. విషాదాలేంటి అని ఒకసారి చూస్తే.. వైసీపీ ఉన్నంత వరకూ ఒక లెక్క.. కూటమి వచ్చిన తరువాత మరో లెక్క అనేలా ఉంది పరిస్థితి.. తూర్పు వ్యవసాయాధారిత జిల్లా.. ఇక్కడ ఆనందమైనా.. బాధయినా పంటతోనే ముడిపడి ఉంటుంది.. ఎందుకంటే జిల్లాలో వరి సాగు విస్తీర్ణమే అధికం.. ఆ సాగు బాగుగా ఉంటే ఆనందమే.. అయితే ఆరంభంలో మాత్రం వైసీపీ రైతులకు చుక్కలు చూపించింది. జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్డంతో బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకుంది.. ఖరీఫ్‌ సీజన్‌లో అయితే 48 గంటల్లోనే ధాన్యం సొమ్ములు చెల్లించి శెహభాష్‌ అనిపించుకుంది.. కోనసీమ అంటే గుర్తొచ్చేది కొబ్బరి పంట.. ఈ ఏడాది కొబ్బరి కాయ రూ.18లు పలికి రికార్డు సృష్టించింది.. ఇక ఖోఖో అయితే వెయ్యి దాటేసింది.. పొగాకు బంగారంగా మారిపోయింది.. నిమ్మకాయ సీజన్‌తో సంబంధం లేకుండా ధర నిలకడగా ఉండిపోయింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది రైతులకు కలిసొచ్చింది..ఈ ఏడాది వ్యవసాయం ఉగాది పచ్చడిలా ఉంది..అంతగా నష్టాలు లేవు.. అలాగని లాభాలు లేవు.. కాస్త తీపి.. కాస్త చేదు.. కాస్త కారం.. ఇలా షడ్రుచులు కనిపించాయి.సాగు బాగుందా అంటే బాగుంది అంతే. గతేడాదికంటే కాస్త బెటర్‌ అని ఖచ్చి తంగా చెప్పవచ్చు.ఎందుకంటే ఈ ఏడాది వరి వర్రీ తీరి పోయింది..ప్రభుత్వం మారిందో లేదో.. అలా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన 48 గం టల్లోనే సొమ్ములు జమయ్యాయి..రబీ సీజన్‌ డబ్బులైతే ఇంకా పడ్డా యో లేవో కూడా తెలియదు.ఎందుకంటే ఆ సీజన్‌ జగన్‌ ప్రభుత్వంలో అన్నదాతలు పంట డబ్బు లకు అష్టకష్టాలు పడ్డారు.ఇక నిమ్మ,కొబ్బరి, పొగాకు, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలైతే దిగుబడి తగ్గ డంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో రైతు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

2.42 లక్షల హెక్టార్లలో సాగు..

ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు రైతులను వెంటాడినా రైతులు గట్టెక్కారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగువిస్తీర్ణం 2.42 లక్షల హెక్టార్లు ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం విధించిన సవాలక్ష నిబంధన ల మధ్య ధాన్యం విక్రయాలు చేపట్టినా రైతులకు ధాన్యం బకాయిలను సకాలంలో చెల్లించలేదు. దీంతో రైతులు ఉద్యమ బాట పట్టారు.మేలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు సకాలంలో చెల్లించి ఆదుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన ధాన్యాన్ని సివిల్‌ సప్లయిస్‌కు విక్రయించిన రైతులకు 48 గంటల్లోనే బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు జమ కావడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. ధాన్యానికి క్వింటాకు రూ.117 మద్దతు ధర కేంద్రం పెంచింది.

నిమ్మ పంట పండింది!

దేవరపల్లి/రాజానగరం : నిమ్మకాయలు ధరలు ఈ ఏడాది ఆరం భం నుంచి తగ్గే దేలే అన్నట్టు రైతులకు కాసులు కురిపిం చాయి. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కిలో ధర రూ.24 నుంచి రూ.45లకు ఎగబాకింది.మార్చి, ఏప్రిల్‌,మేలో కిలో రూ.55 - రూ.60 వరకు పెరు గు తూ వచ్చింది. జూన్‌, జూలై కిలో రూ.20 - రూ.35 వరకు కొంత వరకు తగ్గింది. ఆగస్టు నుంచి డిసెంబర్‌ వర కు రూ.30 - రూ.45 వరకు ధర నిలకడగా ఉంది. వర్షా కాలంలో అధిక వర్షపాతం వల్ల దిగుబడి తగ్గింది.ఈ ఏడా ది సీజన్‌ అన్‌ సీజన్‌ అనే తేడా లేకుండా అన్ని రోజుల్లోనూ ధర పలికింది.

కోకో.. పరుగే..పరుగు

పెరవలి/సామర్లకోట : ఈ ఏడాది కోకో గింజల ధర కేక పెట్టింది.గతంలో ఎన్నడూ లేని విధంగా క్రమ క్రమంగా రేటు పెరుగుతూ ఒక వెయ్యి 50 రూపాయలు గింజల రేటు పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. గతే డాది కేజీ గింజల ధర రూ.240 మాత్రమే పలికింది. సుమారు పదేళ్ల కిందట కేజీ గింజల ధర వంద రూపాయల్లోపు మాత్రమే ఉండేది. ఆ రేటు క్రమ క్రమంగా పెరుగుతూ గతేడాది అధిక ధర రూ.240 పలికింది.ఈ సంవత్సరం రూ.300 నుంచి రూ.800ల వరకూ అత్యధిక ధర రూ.1050 పలకడంలో ఎక్కువ మంది రైతుల కోకో వైపు మొగ్గు చూ పుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సు మారు 58 వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగవుతుంది. పామాయిల్‌ టన్నుకు రూ.20,245 చొప్పున ధర చెల్లిస్తుండడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

పొగాకు..బంగారం

గోపాలపురం : ఈ ఏడాది పొగాకు బంగారమైంది. పొగాకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిలో పొగాకు రికార్డు ధర పలికింది.గతంలో కిలో పొగాకు ధర రూ.200లు పలికితే చాలనుకునే రైతులు ఈ ఏడాది కిలో రూ.400లు ధర పలకడంతో ఎగిరి గంతేశారు. దీంతో పొగాకు సాగు విస్తీర్ణం రెట్టింపయ్యింది. గ్రేడ్‌ -1 పొగాకు క్వింటా ధర రూ.40 వేలు పలకడంతో 2024 రైతులకు తీపి జ్ఞాపకంగా మిగిలింది.

జీడిపప్పు అధరహో

నల్లజర్ల : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో జీడిమామిడి సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉం ది.జీడిమామిడి దిగుబడి తగ్గి డిమాండ్‌ ఎక్కువ ఉండడంతో ధరలు పెరిగాయి.రైతుల వద్ద నుంచి జీడిగింజల సేకరణ పూర్తయ్యాక జీడిపప్పు రేటు పెరగడం కొసమెరుపు.జీడిపప్పు ధర మార్చి నెలలో కిలో రూ.550 ఉండగా అక్టోబరు నెలలో ఏకంగా కిలో రూ.800 చేరింది. నవంబరు నెలలో కిలో రూ20 తగ్గి ప్రస్తుతం కిలో రూ.780 వద్ద స్థిరపడింది. జిల్లాలో సాగు విస్తీర్ణం ఉన్నా ధరలు మాత్రం ఆకాశం వైపే చూస్తున్నాయి.

ముంచెత్తిన..ఏలేరు

ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతను వదల్లేదు. వరదలు, భారీ వర్షాలు, తుఫాన్ల వంటి విపత్తుల వల్ల పంటలను నష్టపోయారు. వరితో పాటు వివిధ రకాల ఉద్యాన, మెట్ట పంటలకు నష్టం వాటిల్లింది. సెప్టెంబరులో సంభవించిన ఏలేరు అకాల వరద వల్ల కాకినాడ జిల్లాలో 14 మండలాల్లో 14,425 హెక్టార్లలో రూ.36 కోట్లు విలువైన పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 26 వేల మంది రైతులకు నష్టం సంభవించింది. అక్టోబరులో అకాల వర్షాలతో కాకినాడ జిల్లాలో 110 హెక్టార్లు, డిసెంబరులో వచ్చిన ఫెంగల్‌ తుఫాన్‌ వల్ల 65 హెకార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. కోనసీమ జిల్లాలో 538 హెక్టార్లలో వరి పంట ముంపు బారిన పడింది. 1926 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం కలిగింది. ఆగస్టులో సంభవించిన గోదావరి వరదల వల్ల కోనసీమ జిల్లాకు నష్టం కలిగింది.తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది.

Updated Date - Dec 29 , 2024 | 12:15 AM