Share News

ఖరీఫ్‌..రిలీఫ్‌!

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:54 AM

జిల్లా రైతాంగం కష్టాల మధ్యే ఖరీఫ్‌ సాగుకు ఉపక్రమిం చారు.. ఇంకా చాలా మంది రైతులకు ధాన్యం అమ్మిన సొమ్ములు చేతిలో పడలేదు.. మరో పక్క సాగుకు సమయ మైంది.. దీంతో రైతులు అప్పులు చేసి సాగులో దిగారు.

ఖరీఫ్‌..రిలీఫ్‌!
కడియంలో సిద్ధమైన నారుమడి

ముందస్తు సాగుకు అన్నదాత సన్నద్ధం

743 హెక్టార్లలో నారుమడులు పూర్తి

సాగులో 2,19,171 మంది రైతులు

58,356 టన్నుల ఎరువులు అవసరం

30 వేల టన్నులే దిగుమతి

రైతాంగం ఎదురుచూపులు

(రాజమహేంద్రవరం- ఆంరఽధజ్యోతి)

జిల్లా రైతాంగం కష్టాల మధ్యే ఖరీఫ్‌ సాగుకు ఉపక్రమిం చారు.. ఇంకా చాలా మంది రైతులకు ధాన్యం అమ్మిన సొమ్ములు చేతిలో పడలేదు.. మరో పక్క సాగుకు సమయ మైంది.. దీంతో రైతులు అప్పులు చేసి సాగులో దిగారు. గత ఐదేళ్లలో ఏం పంట వేయాలో, ఏ రకం ధాన్యం పండించాలో.. అసలు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏ మేరకు కొంటుం దో.. డబ్బులు ఎప్పుడిస్తుందో అర్ధంకాని పరిస్థితి.. బొండాల రకం ధాన్యం ధర బాగుంటుందని ఎక్కువ మంది పండిస్తే తాము కొనేది లేదని.. కేంద్రం నుంచి అనుమతి లేదని తీవ్ర ఇబ్బందులు పెట్టిన రోజులు రైతులు మర్చిపోలేదు.ఈ ఏడాది రబీలో పండించిన పంటను పూర్తిగా కొనలేదు. కొన్న ధాన్యా నికి ఇంకా సుమారు రూ.200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. గతంలో కౌలు రైతులు జిల్లాలో 96 వేల మంది ఉన్న ట్టు గుర్తించినా కౌలు రుణకార్డులు ఇవ్వలేదు.. కాలువల ఆధు నికీకరణ లేదు..డ్రెయిన్లలో తూడు తొలగించలేదు. అయితే రై తులు మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిందని కష్టమైనా ఎదు ర్కొని ఖరీఫ్‌ సాగు చేస్తామనే దిశగా ముందుకు కదులుతున్నారు. జిల్లాలో మొత్తం 2,19,171 మంది రైతులు ఉన్నారు. 85,410 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది 74,856 హెకార్లు సాగులో ఉంటుంది. వరి సాధారణ ఆయకట్టు 78,789 హెక్టార్లు. సాగు అంచనా ప్రకారం 71,515 హెక్టార్లలో పంట ఉంటుంది. మిగిలిన భూమి మొక్కజొన్న, మిర్చి, కందులు, పెసలు తదితర రకాలు సాగు చేస్తున్నారు.

77,817 హెక్టార్లలో ఆయకట్టు

జిల్లాలో 77,817 హెక్టార్లలో సాధారణ వరి ఆయకట్టు ఉంది. ప్రస్తుతం నారుమడి దశలో ఉంది. రాజమహేం ద్రవరం రూరల్‌ మండలంలో 1521 హెక్టార్లలో సాగుకు 76 హెక్టార్ల నారుమడి అవసరం. ఇంత వరకూ 3 హెక్టార్లలో నారుమళ్లు సిద్ధం చేశారు. కడియంలో 2220 హెక్టార్లకు 111 హెక్టార్ల నారుమళ్లు అవసరం 15 హెక్టార్లలో వేశారు. రాజానగరంలో 4842 హెక్టార్లకు 242 హెక్టార్ల నారు అవస రం ఇప్పటి వరకూ 100 హెక్టార్లలో వేశారు. అనపర్తిలో 3821 హెక్టార్లకు 191 హెక్టార్ల నారు అవసరం కేవలం రెండు హెక్టార్లలో వేశారు. బిక్కవోలులో 6224 హెక్టార్లకు 311 హెక్టార్ల నారు అవసరం 3 హెక్టార్లలో వేశారు. కోరుకొండలో 5912 హెక్టార్లకు 296 హెక్టార్ల నారు కావాలి 10 హెక్టార్లలో వేశారు. గోకవరంలో 5124 హెక్టార్లలకు 256 హెక్టార్ల నారు అవసరమైనా ఆరంభం కాలేదు. సీతానగరంలో 5665 హెక్టార్లకు 283 హెక్టార్ల నారు అవసరం 12 హెక్టార్లలో వేశా రు. రంగంపేటలో 2868 హెక్టార్లకు 143 హెక్టార్ల నారు అవసరం 52 హెక్టార్లలో వేశారు.చాగల్లులో 3484 హెక్టార్లకు 174 హెక్టార్ల నారు అవసరం 110 హెక్టార్లలో వేశారు. దేవరపల్లిలో 3718 హెక్టార్లకు 186 హెక్టార్లు అవసరం ఇప్పటి వరకూ 40 హెక్టార్లలో వేశారు.గోపాలపురంలో 4137 హెక్టార్లకు 207 హెక్టార్ల నారు అవసరం కేవలం ఒక హెక్టా రులో వేశారు. కొవ్వూరులో 4589 హెక్టార్లకు 229 హెక్టార్ల నారు అవసరం 160 హెక్టార్లలో వేశారు. నిడదవోలులో 7235 హెక్టార్లకు 362 హెక్టార్ల నారు అవసరం 120 హెక్టార్లలో వేశా రు. పెరవలిలో 3335 హెక్టార్లకు 167 హెక్టార్ల నారు అవస రం 25 హెక్టార్లలో వేశారు. తాళ్లపూడిలో 3832 హెక్టార్లకు 192 హెక్టార్ల నారు అవసరం 40 హెక్టార్లలో వేశారు. ఉండా జ్రవరంలో 4995 హెక్టార్లకు 250 హెక్టార్ల నారు అవసరం 25 హెక్టార్లలో వేశారు. నల్లజర్లలో 4295 హెక్టార్లకు 215 హెక్టార్ల నారు అవసరం 25 హెక్టార్లలో వేశారు. జిల్లాలోని 77,817 హెక్టార్లకు 3891 హెక్టార్ల నారు అవసరం. ఇప్పటి వరకూ 743 హెక్టార్ల నారు వేశారు.ఇంకా ఎక్కడా నాట్లు పడలేదు.

ఎరువులు సిద్ధం

జిల్లాకు 58,356 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం. 25,802 టన్నుల యూరియా, 5028 టన్నుల డీఏ పీ, 6327 టన్నుల ఎంవోపీ, 15,889 టన్నుల ఎన్‌పీకే, 5310 టన్నుల ఎస్‌ఎస్‌పీకి ఎరువులు అవసరం. కానీ ఇప్పటి వరకూ జిల్లాకు యూరియా 13551 టన్నులు,డీఏపీ 1767 టన్నులు, ఎంవోపీ 1944 టన్నులు, ఎన్‌పికె 9134 టన్నులు, ఎస్‌ఎస్‌పి 3602 ట న్నులు వచ్చాయి.ఇప్పటికే రైతులు కొనుగోలు చేసిన దాట్లో 2774 టన్నుల యూరియా,270 టన్నుల డీఏపీ, 552 టన్నుల ఎంవోపీ, 1746 టన్నుల ఎస్‌పికె, 741 టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎ రువులు ఉన్నాయి.28,356 టన్నుల ఎరువులు రావలసి ఉంది.

ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి..

తొమ్మిదెకరాల్లో కౌలు సాగు చేస్తున్నా. దాళ్వాలో వాతావరణం అనుకూలిస్తే 30 బస్తాలు దిగుబడి వస్తుంది. సార్వాలో 35 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తుంది. ఎకరా కు రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే గిట్టు బాటు ధర లభిస్తుంది.అయితే దేవరపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు చేసే రైసుమిల్లులు లేక ఇబ్బందులు పడుతున్నాం.

- గద్దె శరత్‌బాబు, కౌలురైతు, సంగాయిగూడెం

ఆకుమడులు వేస్తున్నాం..

నేను 10 ఎకరాల్లో సాగు చేస్తున్నా. మృగశిర కార్తె ఆరంభం కావడంతో కాలువ నీరు ముందుగా వచ్చే ప్రాంతంలో ఆకుమడులు వేసుకుంటున్నాం. గతంలో స్వర్ణ రకం వేశా. శిస్తు కాకుండా దమ్ము చేసే సమయం నుంచి నాట్లు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, కోత, నూర్పు వంటి వాటికి ఎకరానికి రూ. 30 వేల వరకు ఖర్చవుతుంది.

- తోరాటి కృష్ణమూర్తి, కడియం

ఈసారి ముందస్తు ఖరీఫ్‌

ఈసారి ముందస్తు ఖరీఫ్‌ సాగవుతుంది. దీని వల్ల నవంబరులో వచ్చే తుఫాన్‌ల నుంచి 70 శాతం పంట బయటపడు తుంది.ఈ నెల 15వ తేదీకి నారుమళ్లు పూర్తి కావలసి ఉంది. జూలై నెలాఖ రుకునాట్లు పూర్తవుతాయి. 70 శాతం కోతలు అక్టోబరు, మిగతా 30 శాతం నవంబర్‌లో పూర్తవుతుంది. జిల్లాలో 30 శాతం స్వర్ణ, ఎంటీయూ 7029, పీఎల్‌ఎ 1100 రకాలు 30 శాతం సాగు చేస్తున్నారు. 15 శాతం ఎంటీయూ 1318, 5 శాతం బీపీటీ 5204 సాగు చేస్తున్నారు. రబీలో విత్తనాలకు ఎంటీ యూ 1121,1156, 1153 రకాలు సాగు చేస్తున్నారు.

- ఎస్‌.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - Jun 11 , 2024 | 12:54 AM