Share News

దున్నపోతుకు అంగన్‌వాడీల వినతిపత్రం

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:57 AM

దున్నపోతుకు అంగన్‌వాడీల వినతిపత్రం

దున్నపోతుకు అంగన్‌వాడీల వినతిపత్రం

అమలాపురం టౌన్‌, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం పట్ల దున్నపోతు మీద వాన కురిసినట్టు వ్యవహరిస్తోందని సంఘ నాయ కులు ధ్వజమెత్తారు. ఐసీడీఎస్‌ అమలాపురం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరుకుంది. జగన్‌ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్‌వాడీలు దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. రోజులు గడిచిపోతున్నా ప్రభు త్వంలో చలనం లేకుండా పోయిందని, న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు సంఘీ భావం తెలిపారు. ప్రాజెక్టు నాయకురాళ్లు కె.బేబీగంగా రత్నం, పి.అమూల్య, విజయ ఆధ్వర్యంలో జరిగిన సమ్మె శిబిరంలో ఆయా సెక్టార్ల సంఘ నాయకులు జె.మణిమాల, డి.ఉమామహేశ్వరి, వి.నవోమి, పి.కనకమహాలక్ష్మి, ఐ.కనక దుర్గ, కాశిన దుర్గ, ఎం.శమంతకమణి, సీహెచ్‌ రుక్మిణి, బి.లక్ష్మీకాంతం, జి.సరోజిని, కె.సత్యలలిత, ఎస్‌.వెంకటలక్ష్మి, కె.పరిపూర్ణ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం సీఐటీయూ, అంగన్‌వాడీ నాయకులతో చర్చలు జరిపి అంగన్‌వాడీలకు జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:57 AM