Share News

ఆడుదాం ఆంధ్రా పేరుతో యువతకు ద్రోహం

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:17 AM

స్టేడీయం నిర్మాణాలులేకుండా, క్రీడాకారులకు సౌకర్యాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ ప్రభుత్వం ఆడుదాం ఆం ధ్రా అంటూ యువతను దారుణంగా మోసం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు.

ఆడుదాం ఆంధ్రా పేరుతో యువతకు ద్రోహం

పబ్లిసీటీ పీక్‌ .. డవలప్‌ మెంట్‌ వీక్‌

టీడీపీ నేత ఆదిరెడ్డి, జనసేన నేత అనుశ్రీ

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 4: స్టేడీయం నిర్మాణాలులేకుండా, క్రీడాకారులకు సౌకర్యాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ ప్రభుత్వం ఆడుదాం ఆం ధ్రా అంటూ యువతను దారుణంగా మోసం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల రన్నింగ్‌ ట్రాక్‌ వద్ద గురువారం విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో క్రీడా స్టేడియంలు, క్రీడా మైదానాలు నిర్మించకుండా గాలికొదిలేసి ఈ రోజు ఆడుదాం ఆంధ్రా అని మరొక స్కామ్‌లకు తెరలేపారన్నారు. వేసవి కాలంలో నిర్వహించాల్సిన క్రీడలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆగమేఘాలపై నిర్వహించి యువతను మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆడుదాం ఆంధ్రాకు 345 మంది స్పోర్ట్స్‌మెన్‌లు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా వస్తున్నారని చెప్పడమే తప్ప అంబటి రాయుడు మినహ ఎవరూ కనిపించడం లేదన్నారు. దానవాయిపేట పార్కువద్ద స్కేటింగ్‌, స్విమ్మింగ్‌ పూల్‌ వంటివన్నీ టీడీపీ హయాంలో చేసినవేనని చెప్పారు. మునిసిపల్‌ గ్రౌండ్‌ కూడా గుడా నిధులతో గన్నికృష్ణ హయాంలో కార్పొరేషన్‌ చేసిందని, ఆర్ట్స్‌ కళాశాల ట్రాక్‌ నిర్మాణం కూడా అప్పటి శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు సహకారంతో నిర్మించారని చెప్పారు. సోదరుడు ఎంపీ భరత్‌ 100 రోజుల్లో స్టేడియంలు కట్టేస్తామని చెప్పారని.. అలాంటి వంద రోజులు ఎన్నో వెళ్లిపోయాయన్నారు. టీడీపీ హయాంలో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. రేపు టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే ఒక అద్భుతమైన మల్టీపర్పస్‌ స్టేడియం నిర్మాణం చేస్తామని చెప్పారు. నగరంలో ఎవ్వరిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ఎంపీ భరత్‌ చేసిన పనులవల్ల సమస్యలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. ఎంపీ పబ్లిసిటీ ఫీక్‌, డవలప్‌మెంట్‌ వీక్‌ అని విమర్శించారు. జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిని చెల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేసిన జగన్‌ ఈ రోజు కాకినాడ వచ్చి తన కుటుంబాన్ని విడగొడుతున్నారని ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్‌, నగర ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకి రామయ్య, మాజీ కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్‌, యిన్నమూరి రాంబాబు, కిలపర్తి శ్రీనివాస్‌, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, పార్లమెంట్‌ కమిటీ కార్యదర్ధులు బంగారు నాగేశ్వరరావు, మహబూబ్‌ ఖాన్‌, మిస్కా జోగినాయుడు, రుంకాని విజయ్‌, కంటిపూడి రాజేంద్రప్రౄసాద్‌, జక్కంపూడి అర్జున్‌ పాల్గొన్నారు.

చలో ఆచంట కార్యక్రమాన్ని

విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి

అనపర్తి, జనవరి 4: ఈనెల 7న భీమవరం నియోజకవర్గం ఆచంటలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే బహి రంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భీమవరం టీడీపీ పరిశీలకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా గురువారం నిర్వహించిన భీమవరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రా జ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులను బదిలీలు చేసినట్లుగా ఎమ్మెల్యేను బదిలీ చేయడం ఏపీలోనే చూస్తున్నామని అన్నారు. గెలుపుపై నమ్మకం పోవడంతోనే జగన్‌రెడ్డి మార్పు లు చేసుకుంటున్నారని అన్నారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ నా కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కు టుంబ సభ్యులను వాడుకుని వదిలేసిన ఘనత జగన్‌రెడ్డిదని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసే పరిస్థితి వైసీపీలో ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వర రావు, నల్లమిల్లి సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:17 AM