Share News

లింక్‌ ఏఆర్టీ సెంటర్‌ సేవలు వినియోగించుకోండి

ABN , Publish Date - May 16 , 2024 | 12:20 AM

పెద్దాపురం, మే 15: లింక్‌ ఏఆర్టీ సేవలను హెచ్‌ఐవీ బా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమేష్‌ కోరారు. పట్టణంలోని స్థానిక సీహెచ్‌సీలో ఐసీటీసీ విభాగంలో లింక్‌ ఏఆర్టీ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాజిటీవ్‌ అయిన

లింక్‌ ఏఆర్టీ సెంటర్‌ సేవలు వినియోగించుకోండి

అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమేష్‌

పెద్దాపురం, మే 15: లింక్‌ ఏఆర్టీ సేవలను హెచ్‌ఐవీ బా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమేష్‌ కోరారు. పట్టణంలోని స్థానిక సీహెచ్‌సీలో ఐసీటీసీ విభాగంలో లింక్‌ ఏఆర్టీ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాజిటీవ్‌ అయిన కేసులు ఏఆర్టీ రిజిస్ట్రేషన్‌ చేసి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రోగులు ఇకపై కాకినాడకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. అనంతరం లింక్‌ ఏఆర్టీ సెంటర్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సూపరిన్‌టెండెంట్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి, పీఎం ఆదిలింగం, ఐసీటీసీ కౌన్సిలర్‌ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 12:20 AM