Share News

డ్రైవర్‌కు ఏడాది జైలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:38 AM

కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన టాక్సీ డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ పిఠాపురం అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎం.లీలాసాయిసుభాష్‌ తీర్పు చెప్పారు. శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన సలపరెడ్డి పాండురంగారావు(38) ఒక మహిళతో మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా, గొల్లప్రోలు మండలం కొత్త వజ్రకూటం వద్ద రాజమహేంద్రవరం నుంచి కత్తిపూడి వెళుతున్న కారు ఢీకొట్టింది.

డ్రైవర్‌కు ఏడాది జైలు

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 6: కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన టాక్సీ డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ పిఠాపురం అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎం.లీలాసాయిసుభాష్‌ తీర్పు చెప్పారు. శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన సలపరెడ్డి పాండురంగారావు(38) ఒక మహిళతో మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా, గొల్లప్రోలు మండలం కొత్త వజ్రకూటం వద్ద రాజమహేంద్రవరం నుంచి కత్తిపూడి వెళుతున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పాండురంగారావుతో పాటు గుర్తు తెలియని మహిళ మరణించారు. 2018 ఏప్రిల్‌ 3న సంఘటన జరగగా అప్పటి ఎస్‌ఐ కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమయిన విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన కారు డ్రైవర్‌ సలపు సత్తిబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాలు అనంతరం నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏపీపీ ఆకుల నాగలీలా రోజా ప్రాసిక్యూషన్‌ నిర్వహించగా, సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ బాలాజీ, కోర్టు కానిస్టేబుల్‌ వై.రాజాబాబులు సాక్షులను హాజరు పరచడంలో సహకరించారు.

Updated Date - Feb 07 , 2024 | 12:39 AM