Share News

చిన్నారికి దెబ్బ తగిలితే..కాలం చెల్లిన ఆయింట్‌మెంట్‌ పూశారు..

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:44 AM

మం దులు వాడే సమయంలో ఎక్స్‌ఫైరీ డేట్‌ చూడడం అనేది ప్రధాన విధి.. నిర్లక్ష్యంగా ఏదో మందు ఉంది కదా అని వాడా మా ఇలా ఇబ్బందులు తప్పదు.

చిన్నారికి దెబ్బ తగిలితే..కాలం చెల్లిన ఆయింట్‌మెంట్‌ పూశారు..
చిన్నారి చేతిపై దెబ్బ

అనపర్తి,మార్చి 21 : మం దులు వాడే సమయంలో ఎక్స్‌ఫైరీ డేట్‌ చూడడం అనేది ప్రధాన విధి.. నిర్లక్ష్యంగా ఏదో మందు ఉంది కదా అని వాడా మా ఇలా ఇబ్బందులు తప్పదు. అనపర్తి మండలం రామవరం ఎస్సీ పేటలోని అంగన్‌వాడీ సెం టర్‌లో చిన్నారి పట్ల సిబ్బంది చూపిన నిర్లక్ష్య వైఖరి ఆలస్యంగా వెలుగు చూసింది. అనపర్తి మండలం రామవరం ఎస్సీపేటలోని అంగన్‌వాడీ కేం ద్రంలో దీపాశ్రీ చదువుకుంటుంది. ఈ నెల 18వ తేదీన సెంటర్‌లో ఉన్న గేటుపైకి ఎక్కి ఆడుకుంటూ గేటుపై నుంచి దీపాశ్రీ కిందకు పడిపోవ డంతో చేతికి గాయమైంది. అయితే సెంటర్‌లోని కార్యకర్త జె.లక్ష్మీకటాక్షం పాపను ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా చేతికి కట్టుకట్టి కాలం చెల్లిన ఆయింట్‌మెంట్‌ను ఇచ్చి ఇంటికి పంపింది. మరు సటి రోజు తల్లిదండ్రులు కట్టువిప్పి కార్యకర్త ఇచ్చిన ఆయింట్‌మెంట్‌ పాప చేతికి పూశారు. అయితే పాపకు తగిలిన గాయం తగ్గకుండా పెద్దదైంది. కార్యకర్త ఇచ్చిన ఆయింట్‌ మెంట్‌ను పరిశీలించగా అప్పటికే అది కాలం చెల్లిందని గుర్తించిన తల్లిదం డ్రులు అవాక్కయ్యారు. వెంటనే పాపను తీసుకుని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన తల్లిదండ్రులు చిన్నారి చేతికి కుట్లు వేయించి చికిత్స చేయించా రు.అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తపై తల్లి దండ్రులు రంగంపేట సీడీ పీవో జెస్పీ ప్లోరెన్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మీ కటాక్షంకు మెమో జారీ చేశారు.తక్షణమే వివరణ ఇవ్వాలని ఆమెను సీడీపీవో ఆదేశించారు.

Updated Date - Mar 22 , 2024 | 12:44 AM