Share News

మొక్కు తీరకుండానే మృత్యుఒడికి..

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:51 AM

గుడికి మొక్కు తీర్చుకుందామని వెళ్లిన ఆనందం ఆ కుటుంబంలో గంటల్లో ఆవిరై పోయింది.

మొక్కు తీరకుండానే మృత్యుఒడికి..

రాజమహేంద్రవరం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): గుడికి మొక్కు తీర్చుకుందామని వెళ్లిన ఆనందం ఆ కుటుంబంలో గంటల్లో ఆవిరై పోయింది. బొమ్మూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పట్నం జిల్లా కొత్తగాజువాకకు చెందిన గొర్ల నాయుడు(26) ఏవీ అప్పారావు రోడ్‌లో అక్కాబావ దగ్గర ఉంటున్నాడు. తన బావ అప్పల నాయుడు సూపర్‌వైజర్‌గా పనిచేసే రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. మొక్కు తీర్చుకోవడానికి కుటుంబీకులతో కలిసి ఆదివారం కేశవరంలోని గుడికివెళ్లాడు. ఏవో సరుకులు అవసరం కావడంతో రాజమహేంద్రవరం వచ్చి తిరిగి వెళుతుండగా రాజవోలు రోడ్డులో పక్కనే వెళ్తున్న పౌర సరఫరాల బియ్యం రవాణా చేసే వ్యాన్‌ తొట్టి వెనుక భాగం అతడి తల కు బలంగా తగిలింది.దీంతో నాయుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జుబేర్‌ తెలిపారు.

Updated Date - Jan 29 , 2024 | 07:46 AM