Share News

ఆసరా..అంతేగా!

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:39 AM

తెల్లారితే అప్పులతో ముఖం కడుక్కొనే దుస్థితిలో ఉన్న జగన్‌ జమానాలో బటన్‌ నొక్కినంత వేగంగా, సులభంగా పనులు మాత్రం జరగడం లేదు. ఈ నాలుగేళ్ల పది నెలల పాటు రుణాలతో దర్పం ప్రదర్శిస్తూ వచ్చారు. దొరికిన చోటల్లా చేయి చాచారు.

ఆసరా..అంతేగా!

లబ్ధిదారుల ఎదురుచూపులు

50 శాతం జమకాని వైనం

జిల్లాలో 32,707 గ్రూపులు

జమైన వారి లెక్కలూ లేవు

వస్తుందో రాదోనని ఆందోళన

ఎన్నికల వేళ ఓటు రాజకీయం?

నగదు జమైతే..ఓటుకు లింక్‌

డ్వాక్రా మహిళలకు సర్కారు ఎర

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

తెల్లారితే అప్పులతో ముఖం కడుక్కొనే దుస్థితిలో ఉన్న జగన్‌ జమానాలో బటన్‌ నొక్కినంత వేగంగా, సులభంగా పనులు మాత్రం జరగడం లేదు. ఈ నాలుగేళ్ల పది నెలల పాటు రుణాలతో దర్పం ప్రదర్శిస్తూ వచ్చారు. దొరికిన చోటల్లా చేయి చాచారు. చివరికి భవిష్యత్తులో విక్రయించే మద్యంపై కూడా అప్పు లాగేసినా, సచివాలయాలను తాకట్టు పెట్టేసినా అది వైసీపీ సర్కారుకే చెల్లింది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో జగన్‌ ప్రభుత్వంలో గల్లాపెట్టే డొల్లతనం బయట పడుతోంది. పైసా పుట్టడం కష్టతరం కావడంతో ‘ఆసరా’ సొమ్ములు నీరసంగా జమ అవుతున్నాయి. నాలుగో విడత ఇదిగో అంటూ జగన్‌ బటన్‌ నొక్కి మూడు వారా లు గడిచినా 50 శాతం మందికి కూడా రుణ మాఫీ సొమ్ములు బ్యాంకుల్లో జమ కాలేదు.

అసలు వస్తుందా?

ప్రభుత్వం వద్ద సొమ్ములు లేవనే విషయం బహిరంగ రహస్యం. ప్రతి రోజూ అప్పులు చేస్తే గానీ పూట గడవని దుస్థితిలో ఆర్థికం కొట్టుమి ట్టాడుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ వచ్చా రు. ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. ఇప్పటి వరకూ అధికారాన్ని అడ్డుపె ట్టుకుని చేయి చాచడంతో నయానో, భయానో రుణం పుట్టేది. జగన్‌ ప్రభుత్వంపై నమ్మకం లేక పోవడంతో ఇప్పుడు రుణదాతలు పైసా విధిల్చే పరిస్థితి లేదు. ఆ ప్రభావం పథకాలపై పడు తోంది. ఆసరా రుణమాఫీ సొమ్ములు నాలుగో విడత విడుదలకు మార్చి 1న జగన్‌ ఆర్భాటంగా ఎప్పుడు మాదిరిగానే బటన్‌ నొక్కి నాలుగు మాటలు చెప్పి ప్యాలెస్‌కి వెళ్లిపోయారు. తర్వాత ఆ సొమ్ములు జమ చేయడానికి సాంకేతిక కార ణాలు చూపిస్తూ కాలాన్ని గెంటుతున్నారు. ఎన్నికల సంఘం చెప్పినా లెక్కచేయకుండా వలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వినియోగి స్తుండడంతో కేవైసీ తదితర అడ్డంకులు దాట డానికి లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2020-21 నుంచి నాలుగు విడ తలుగా రుణమాఫీ సొమ్ములు జమ చేస్తామని జగన్‌ చెప్పారు. ఏడాదికి ఒక విడత చొప్పున జమ చేస్తున్నారు. ఈ నెలలో చివరి విడత జమ కావాల్సి ఉంది. దీనిలో భాగంగానే సీఎం బటన్‌ నొక్కారు. అయితే నేటికీ డబ్బులు జమకాలేదు.

జిల్లాలో 32,707 గ్రూపులు

తూర్పు గోదావరి జిల్లాలో నాలుగో విడతకు సంబంధించి 32,707 గ్రూపుల్లో 3,27,070 మం దిని ఆసరా(వైఎస్‌ఆర్‌కేపీ) లబ్ధిదారులుగా గుర్తిం చారు. వీరికి సంబంధించి బ్యాంకు ఖాతాల్లో రూ.1105.87 కోట్లు జమ కావాల్సి ఉంది. కానీ 50 శాతం కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. మండలాల వారీగా చూస్తే.. అనపర్తి 1310, బిక్కవోలు 1522(మొదటి విడతలో 1523), చాగల్లు 1234, దేవరపల్లి 1660(1661), గోకవరం 1465, గోపాలపురం 1465, కడియం 1538, కోరు కొండ 1575, కొవ్వూరు 1324(1325), నల్లజర్ల 1620, నిడదవోలు 1438, పెరవలి 1531, రాజ మహేంద్రవరం రూరల్‌ 2635, అర్బన్‌ 3997, రాజానగరం 2089, రంగంపేట 1170, సీతా నగరం 1632, తాళ్లపూడి 1117, ఉండ్రాజవరం 1299(1300), కొవ్వూరు 545, నిడదవోలులో 540 గ్రూపుల్లోని మహిళలకు రుణమాఫీ జమకావాల్సి ఉంది. కానీ ఏ ఒక్క మండలంలోనూ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకూ అసరా అందలేదు.

ప్రలోభానికా..?

ఎన్నికల సందర్భంగా ఏ ప్రలోభాన్నీ వైసీపీ ప్రభుత్వం వదలడం లేదు. ఏ పథకంలో అర్హుదారులనైనా ఓటుతో ముడిపెడుతు న్నారు. నాలుగేళ్ల పది నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా పరోక్షంగా, ప్రత్యక్షంగా చేసిన సహాయాన్ని లెక్క గట్టి సొంత సొమ్ము ఇచ్చినట్లుగా బిల్డప్‌ ఇస్తున్నారు. కుడి చేతిలో సొమ్ము పెట్టి ఎడమ చేతితో లాగేసుకోవడం వైసీపీ ప్రభుత్వంలో మరో మెలిక. ఇప్పుడు ఆసరా సొమ్మును కూడా ఓట్లతో బేరీజు వేస్తున్నారు. ఆసరా సొమ్మును నెమ్మదిగా వేస్తూ జమ అయిన లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఓటు వేయాలంటూ డిమాండ్‌ చేయాలని వైసీపీ నాయకులు వలంటీర్లు, ఆర్పీలు, సీఆర్పీలపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో బ్యాంకు ఖాతాలో జమ అయిన వారి వివరాలు తెలుసు కుని ఓటు వేయాలని లేకపోతే ఈ లబ్ధి ఉండ దంటూ ప్రలోభ పెడుతున్నారు. ఎన్నికల సమ యం ఆసన్నమయ్యే వరకూ ఇలా కాలయాపన చేస్తే ఓట్లు దండుకోవచ్చనే కుయుక్తి ఈ పథ కంలోనూ ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి.

ఎందుకు గోప్యత

ఆసరా ఎందరి ఖాతాల్లో జమ చేశారన్న విషయం గోప్యంగా ఉంచుతున్నారు. ఖాతాలో నేరుగా జమ చేస్తున్నందున సదరు లబ్ధిదారుడికి మాత్రమే ఫోన్‌ ద్వారా సమాచారం అందుతుం దని తమ వద్ద వివరాలు ఉండవని, అందువల్ల లెక్కాపత్రం తెలియదని అధికారులు సమాధాన మిస్తున్నారు. మరోవైపు తమ పరిధిలో ఉన్న గ్రూపుల్లో ఎందరికి రుణమాఫీ సొమ్ములు పడ్డాయో రిసోర్స్‌ పర్సన్‌(ఆర్పీ)లకు కూడా తెలి యదంట. దీంతో నెమ్మదిగా జమ చేస్తున్నారనే సమాధానం ఎదురవుతోంది. జిల్లాలో ఇప్పటి వర కూ ఎంత మందికి రుణమాఫీ నాలుగో విడత వర్తించిందో, ఇంకా ఎందరు ఎదురు చూస్తున్నారో జిల్లా స్థాయి అధికారులకు తెలియదు.

Updated Date - Mar 22 , 2024 | 12:39 AM