Share News

ఆక్రమణల.. భరతం పడతారా!

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:33 AM

పట్టణాల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి.. ఖాళీ జాగా కనిపిస్తే ఒట్టు రోడ్డయినా వదలడంలేదు.. దర్జాగా ఆక్రమించేస్తున్నారు.. అయినా ఎందుకో మరి అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు..

ఆక్రమణల.. భరతం పడతారా!
అనపర్తిలో రోడ్డు మధ్యనే దుకాణాలు

పట్టించుకోని అధికారులు

పట్టణాల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి.. ఖాళీ జాగా కనిపిస్తే ఒట్టు రోడ్డయినా వదలడంలేదు.. దర్జాగా ఆక్రమించేస్తున్నారు.. అయినా ఎందుకో మరి అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు.. గతంలో ప్రభుత్వ స్థలం ఆక్రమించాలంటేనే భయపడేవారు.. ఇప్పుడ దేం లేదు.. ప్రభుత్వ స్థలమైనా పక్కా భవనాలు కట్టేస్తున్నారు.. ఇక రాజమహేంద్రవరం వంటి రద్దీ మార్కెట్లలో అయితే మరీ దారుణం. గజం జాగా ఖాళీగా ఉన్నా తెల్లారేసరికి అంతే.. దీంతో ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడంలేదు. రాజమహేంద్ర వరం కాతేరు రోడ్‌.. అనపర్తిలోని ప్రధాన రోడ్డు ఇందుకు ఉదాహరణ. ఇకనైనా అధికారులు ఆక్రమణల భరతం పడతారేమో వేచి చూడాల్సిందే!

పేపర్‌మిల్లు రోడ్‌లో నిత్య నరకం!

రాజమహేంద్రవరం రూరల్‌, ఆగస్టు 20 : రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామ పరిధిలో మల్లయ్యపేట, పేపరుమిల్లు పెట్రోల్‌ బంక్‌ వరకు రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపో యాయి. దీంతో అటుగా లారీలు, బస్సు లు, ఇతర భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కనీసం కారులోనూ వెళ్లడం కష్టంగానే ఉంది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళలో స్కూల్‌, కాలేజీ బస్సులు, పేపరుమిల్లు లారీలు ఇతర వాహనాలతో రోడ్డు బ్లాక్‌ అవుతుంది. రాజమహేంద్రవరం రోడ్‌ కం రైలు బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వైపునకు భారీ వాహనాలకు అనుమతులు నిలుపుదల చేసినప్పటి నుంచి ఆర్‌టీసీ బస్సులు, ఇతర వాహనాలన్నీ పేపరుమిల్లు, కాతేరు రోడ్డు మీదుగా నాల్గో బ్రిడ్జి గుండా విజయవాడ జాతీయ రహదారిపైకి వెళుతున్నా యి. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ఆర్‌టీసీ , ప్రైవేట్‌ బస్సులు అన్ని కాతేరు,పేపరుమిల్లు మీదుగానే రాజమహేంద్రవరంలో ప్రవేశిస్తున్నాయి. కాతేరు నుంచి పేపరుమిల్లు వరకు ఉన్న రోడ్డు ఇరువైపులా అక్రమణలు పెరిగిపోవడంతో ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పడంలేదు. మల్లయ్యపేట నుంచి పేపరుమిల్లు గేటు వరకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం భారీగా ట్రాఫిక్‌ నిలుస్తుంది. పేపరుమిల్లు పెట్రోల్‌ బంక్‌ సెంటర్‌ ప్రమాదభరితంగా మారింది. అక్కడ రోడ్డుకు ఇరువైపులా కలప లారీలు నిలుపుదల చేస్తుండడంతో ఇబ్బం దులు తప్ప డం లేదు. కాతేరు -పేపరుమిల్లు రోడ్డులో తరచు ప్రమాదాలు జరుగుతున్నా.. ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నా కనీసం ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడంలేదు.

అనపర్తిలో రోడ్డునూ వదల్లేదు..

అనపర్తి, ఆగస్టు 20 : ఖాళీగా కన బడిందా ఆక్రమించెయ్‌.. ట్రాఫిక్‌కు ఇబ్బంది అవు తున్నా మనకేం పని.. మన వ్యాపారం మనదే.. ప్రస్తుతం అనపర్తి మెయిన్‌రోడ్డులో ఇదే పరిస్థితి. గతంలో పాలకులు అనపర్తి మెయిన్‌రోడ్డును సీసీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. స్థానిక ఐఎల్‌టీడీ సౌజన్యంతో సెంటర్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారుల కోసం సెంటర్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఇదంతా గతంలో జరిగిన ఏర్పాటు..అయితే ప్రస్తుతం అనపర్తి మెయిన్‌రోడ్డులో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. సెంటర్‌ పార్కింగ్‌ స్థలాన్ని చిరు వ్యాపారులు ఆక్రమించుకుని భారీ దుకాణాలు ఏర్పాటు చేయడంతో పార్కింగ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.రోడ్డుకు ఇరువైపుల ఉన్న షాపు లకు వచ్చే కస్టమర్లు సెంటర్‌ పార్కింగ్‌ చేసుకునేందుకు అవకాశం లేక షాపుల ముందే బైక్‌లను పార్కింగ్‌ చేసుకుని షాపులకు వెళుతున్నారు.దీంతో కనీసం మోటారు సైకిల్‌ వెళ్లే వీలు లేక ప్రయా ణికులు ఇబ్బందులు పడుతున్నారు.చిరు వ్యాపారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెయిన్‌రోడ్డు వ్యాపారులు సమస్య పరిష్కా రంపై చర్చిం చేందుకు బుధవారం వర్తక సంఘ కల్యాణ మండపంలో సమావేశం కానున్నారు. పార్కింగ్‌ సమస్యపై చర్చించి అధికారులు, నాయకులకు వివరిస్తామని వ్యాపారులు చెపుతున్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:33 AM