Share News

9 గ్యారెంటీలతో ఏపీకి న్యాయం

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:56 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కాంగ్రెస్‌పార్టీ 9 గ్యారెంటీలతో న్యాయం చేస్తుందని ఏఐసీసీ రాష్ట్ర పరిశీలకుడు మనోజ్‌చౌహన్‌ అన్నారు.

9 గ్యారెంటీలతో ఏపీకి న్యాయం

ఏఐసీసీ అబ్జర్వర్‌ మనోజ్‌ చౌహన్‌, ఎంపీ అభ్యర్థి గిడుగు

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 7: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కాంగ్రెస్‌పార్టీ 9 గ్యారెంటీలతో న్యాయం చేస్తుందని ఏఐసీసీ రాష్ట్ర పరిశీలకుడు మనోజ్‌చౌహన్‌ అన్నారు. రాజమహేంద్రవరం హోటల్‌ ఆనంద్‌ రీజెన్సీ పందిరి హాలులో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రధాని మోదీ, అమిత్‌ షాలను ఎదుర్కొనే ఏకైౖక నాయకుడు రాహుల్‌గాంధీ అని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ కాంగ్రెస్‌ నాయకులు కలవాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు వివరించాలన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రత్యేక హోదాను తీసుకురాలేపోయిందన్నారు. రాష్ట్రానికి న్యాయంర చేసే పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. రాజమహే ంద్రవరం లోక్‌సభ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ వారసులం తామేనని జగన్‌ కేవలం వైఎస్‌ఆర్‌ ఆస్తికి మాత్రమే వారసుడని స్పష్టం చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్‌, ఎస్‌ఎన్‌ రాజా, రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి బోడా వెంకట్‌, రూరల్‌ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్‌, అనపర్తి అభ్యర్థి డాక్టర్‌ యళ్ళ శ్రీనివాసరావు, రాజానగరం అభ్యర్థి ఎం.వెంకటశ్రీనివాస్‌, కొవ్వూరు అభ్యర్థి అరిగెల అరుణకుమారి, నిడదవోలు అభ్యర్థి పెదిరెడ్డి సుబ్బారావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి శ్రీనివాస్‌, సీపీఐ నుంచి కొండలరావు, సీపీఐ కార్యదర్శి ముళ్ళ మాధవ్‌, మార్టిన్‌ లూధర్‌, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, కృష్ణాజిల్లానాయకులు సంజీవరెడ్డి, కొత్తూరి శ్రీను, మట్టాప్రసాద్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:56 AM