Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

9, 10న అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:27 AM

మూడు దశాబ్ధాలుగా అమెరికాలో అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రెండురోజులపాటు ఈనెల 9, 10వ తేదీల్లో అఖిల భారత తెలుగు సదస్సు జరగనుంది.

9, 10న అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు

కార్పొరేషన్‌(కాకినాడ), మార్చి 3: మూడు దశాబ్ధాలుగా అమెరికాలో అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రెండురోజులపాటు ఈనెల 9, 10వ తేదీల్లో అఖిల భారత తెలుగు సదస్సు జరగనుంది. కాకినాడ దంటు కళాక్షేత్రంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగూరి చిట్టెన్‌రాజు సదస్సు ఆహ్వానపత్రికను ఆదివారం ఆవిష్కరించారు. చిట్టెన్‌రాజు మాట్లాడుతూ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా కాకినాడలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు జరుపుతున్నట్లు తెలిపారు. భారత 13వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారని పద్మభూషణ్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌, మండలి బుద్ధప్రసాద్‌ అతిథులుగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో మార్నిజానకిరామచౌదరి, కొరుప్రోలు గౌరినాయుడు, డాక్టర్‌ జోస్యుల కృష్ణబాబు, వైఎస్‌ఎన్‌ మూర్తి, డాక్టర్‌ శైలజ, సుచిత్రామూర్తి, ప్రకాష్‌, చింతపల్లి సుబ్బారావు, సాయిసత్యనారాయణ, ప్రభుదాస్‌, కృష్ణారావు పాల్గొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రు

Updated Date - Mar 04 , 2024 | 12:27 AM