రూ.6.92 కోట్లు పెండింగ్
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:44 AM
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పెండింగ్ బిల్లులకు సంబంధించి మోక్షం లభించనుంది. అప్పులు చేసి ఇళ్లు నిర్మించిన లబ్ధిదారులకు అసలు బిల్లు లు వస్తాయో లేదో తెలియని అయోమయంతో ఎదురు చూస్తున్న తరుణంలో కూటమి ప్రభు త్వం తీపి కబురు అందిం చింది.

రాజానగరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ బకాయిలు
సర్వే పూర్తి చేసిన గృహ నిర్మాణశాఖ
జాబితాను ప్రభుత్వానికి నివేదించిన హౌసింగ్ అధికారులు
రాజానగరం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పెండింగ్ బిల్లులకు సంబంధించి మోక్షం లభించనుంది. అప్పులు చేసి ఇళ్లు నిర్మించిన లబ్ధిదారులకు అసలు బిల్లు లు వస్తాయో లేదో తెలియని అయోమయంతో ఎదురు చూస్తున్న తరుణంలో కూటమి ప్రభు త్వం తీపి కబురు అందిం చింది. దీంతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరు స్తోంది. 2014- 2019 మధ్య ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలకు వైసీపీ ప్రభుత్వం కక్ష పూరి తంగా బిల్లులు చెల్లించలే దు. వివిధ దశల్లో పూర్త యిన ఇళ్లకు బిల్లులు రూ పొందించి గృహ నిర్మాణశాఖ ఆన్‌లైన్‌లో పొందు పరిచినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు వంతున ఎస్సీ, ఎస్టీ లకు రూ.2.5 లక్షలు యూనిట్ విలువగా అప్ప ట్లో నిర్ణయించారు. నాలుగు దశల్లో ఇళ్ల నిర్మాణా లకు బిల్లులు ఇచ్చేవారు పునాది పూర్తయిన వెం టనే గతంలో బిల్లు వచ్చేది. దీంతో ఇంటి నిర్మా ణంలో తదుపరి దశకు వెళ్లేవారు. వైసీపీ ప్రభు త్వం వచ్చే నాటికి పునాదులు పూర్తయిన బిల్లు అప్‌లోడ్ చేసినా సొమ్ములివ్వలేదు. నియోజక వర్గంలోని రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో 962 ఇళ్ల లబ్ధిదారులకు సంబంధిం చి రూ.6.92కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కోరుకొండ మండలంలో 276 మంది లబ్ధిదారు లకు రూ.1.82కోట్లు, రాజానగరం మండలంలో 309 మంది లబ్ధిదారులకు రూ.2.32 కోట్లు, సీతా నగరం మండలంలో 377 మంది లబ్ధిదారులకు రూ.2.75 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లుగా అధికారులు నివేదించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 962 మంది లబ్ధిదారులకు సంబంధించి రూ.6.92 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు గృహ నిర్మాణశాఖాధికారులు చెప్పారు.
క్షేత్రస్థాయి సర్వే పూర్తి..
పెండింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఇళ్లు ప్రస్తుత పరిస్థితిపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నివే దిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లను గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో సహాయ ఇంజనీర్లు, సిబ్బంది గ్రామాల్లో సర్వేను ఇప్పటికే పూర్తి చేశారు. తాజా పరిస్థితిని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి నివేదించినట్టు సంబంధిత అధికారులు చెప్పారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే గుర్తించిన ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు దశల వారీగా బిల్లులు చెల్లిస్తామని రాజానగరం హౌసింగ్ ఏఈ ఏవీ రామారావు తెలిపారు.