Share News

52 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:25 AM

ద్రాక్షారామ, ఫిబ్రవరి 12: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపుపేటలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాం ఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం అస్వస్థతకు గుర య్యారు. అందులో 8 మందిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలిం

52 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

8 మందికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స

కలుషిత ఆహారమే కారణమంటున్న వైద్యులు

పలువురు ప్రముఖుల పరామర్శ

ద్రాక్షారామ, ఫిబ్రవరి 12: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపుపేటలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాం ఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం అస్వస్థతకు గుర య్యారు. అందులో 8 మందిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా రు. కలుషిత ఆహారం తినడం కారణంగా విద్యార్థు లు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా నిర్థా రించారు. ఈ గురుకుల పాఠశాలలో 450 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వారిలో కొంతమందికి ఆదివారం రాత్రి వాంతులు, రక్త విరోచనాలు అయ్యాయి. గురుకుల పాఠశాల ఆరోగ్య పర్యవేక్షకుడు విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించా డు. సోమవారం ఉదయం నాటికి అస్వస్థతకు గురై న వారి సంఖ్య 52కు చేరుకుంది. అందులో కొంతమందికి వాంతులతోపాటు రక్త విరోచనాలు అయ్యా యి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ దుర్గారావుదొర పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వైద్య అందుతున్న తీరును పరిశీలించారు.

పీహెచ్‌సీ వైద్య శిబిరం

పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ ప్రశాంతి, డాక్టర్‌ సం దీప్‌ నాయుడు, డాక్టర్‌ అలేఖ్య, డాక్టర్‌ మణికంఠలు గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పా టుచేశా రు. విద్యార్థులను పరీక్షించారు. ప్రాథమిక చికిత్స అందించారు. వాంతులు, రక్త విరోచనాలవుతున్న ఐదుగురితోపాటు మరో 8 మందిని అంబులెన్సులో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పర్యవేక్షకుడు డాక్టర్‌ వీరభద్రుడు, పిల్లల వైద్యులు విద్యార్థులకు చికిత్స అందచేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ దుర్గారావుదొర, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కోఆర్డినేటర్‌ సంజీవరావు, సంయుక్త కార్యదర్శి, ఇతర అధికారులు ఆసుపత్రిలో విద్యార్థుల కు అందుతున్న చికిత్సను పరిశీలించారు. అందిం చిన చికిత్స వివరాలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి తీసుకున్న ఆహారం, అస్వస్థత ఎలా గురయ్యారని అడిగి తెలుసుకున్నారు. అలాగే టీడీపీ రామచంద్రపురం నియోజకవర్గం ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన నియోజకవర్గం ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌, వైసీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి పిల్లి సూ ర్యప్రకాష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గాదంశెట్టి శ్రీదేవి, ఎం పీపీ అంబటి భవానీ ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు. చికిత్స వివరాలు అడిగారు.

కలుషిత ఆహారమే కారణం

విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ కావడం వల్లే అస్వస్థతకు గురయ్యారని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ దుర్గారావుదొర తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉందని, మంగళవారం ఉదయం డిశ్చార్జి చేయవచ్చని తెలిపారు. రెండో శని వారం పేరెంట్స్‌డే కావడంతో విద్యార్థులు తమ తల్లి దండ్రులు తీసుకువచ్చిన మాంసాహారం భుజించారు. ఆదివారం ఉదయం అల్పాహారంగా పూరి, మధ్యాహ్నం చికెన్‌ బిర్యానీ ఆహారంగా తీసుకున్నారు. ఆహా రం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తేల్చారు.

కమిటీ వేసి నిర్థారించాలి..

రామచంద్రపురం, ఫిబ్రవరి 12: ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడుతూ అదృష్ట వశాత్తు విద్యార్థులు క్షేమంగా ఉ న్నారని, ఘటనకు కారణమేమిటో కమిటీ వేసి నిర్ధారించాలని, బాధ్యు డైన హాస్టల్‌ వార్డెన్‌ను తక్షణం సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విద్యార్థులను పరామర్శించారు. జనసేన, టీడీపీ, వైసీపీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 01:25 AM