Share News

జిల్లా స్థాయి స్పందనకు 415 అర్జీలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:45 AM

జిల్లా స్థాయి స్పందనకు 415 అర్జీలు

జిల్లా స్థాయి స్పందనకు 415 అర్జీలు

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 26 : జగనన్నకు చెబుదాం.. జిల్లాస్థాయి స్పందనకు 415 అర్జీలు అందాయి. సోమ వారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ స్పందన సమావేశ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలె క్టర్‌ కృతికాశుక్లాతోపాటు డీఆర్వో డి.తిప్పే నాయక్‌, హౌసింగ్‌ పీడీ కె శ్రీరమణి, సీపీవో పి.త్రినాథ్‌, జడ్పీ డిప్యూటీ సీఈవో రాంగోపాల్‌లతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఈ అర్జీలను సత్వ రం పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 01:45 AM