Share News

21 మంది ఎస్‌ఐలకు పోస్టింగులు

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:34 AM

జిల్లాలో సీసీఎస్‌-2, ఎస్‌బీతోపాటు వీఆర్‌లో ఉన్న 19 మంది ఎస్‌ఐలకు స్టేషన్లు కేటాయిస్తూ (ఎటాచ్‌ మెంట్‌) ఎస్పీ నరసింహకిషోర్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

21 మంది ఎస్‌ఐలకు పోస్టింగులు

రాజమహేంద్రవరం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీసీఎస్‌-2, ఎస్‌బీతోపాటు వీఆర్‌లో ఉన్న 19 మంది ఎస్‌ఐలకు స్టేషన్లు కేటాయిస్తూ (ఎటాచ్‌ మెంట్‌) ఎస్పీ నరసింహకిషోర్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీఆర్‌లో ఉన్న వి.అప్పలరాజును త్రీ టౌన్‌, పి.విజయ్‌కుమార్‌ త్రీటౌన్‌, కేవీ నాగార్జున, పి. నారాయణమ్మ రాజానగరం, సీహెచ్‌ రామకృష్ణ ఎయిర్‌పోర్ట్‌, ఎం.వెంకటేశ్వరరావు పెరవలి, కె.నాగ రాజు, జీఎస్‌ఆర్‌కే పరమహంస టూటౌన్‌, పీడీఎల్‌ ప్రసన్న కడియం, జి.పరమేశం, సీహెచ్‌వీ రమేశ్‌ బొమ్మూరు, ఎం.వెంకట రేవతి ట్రాఫిక్‌, ఎల్‌.బాలాజీ సుందర రావు సీసీఎస్‌-1, ఎ.ఆనందరెడ్డి సీసీఎస్‌-2, వి.సంపత్‌, కె.దుర్గా ప్రసాదరావు సీసీఎస్‌-3, ఎ.ఫణిమొహన్‌, ఎస్‌ఎన్‌వీవీ రమేశ్‌, ఎండీ అష్ఫాక్‌ను డీఎస్‌బీకి అటాచ్‌ చేశారు. డీఎస్‌బీలో పని చేస్తున్న డీ.వాణిని త్రీటౌన్‌కి, సీసీఎస్‌-2 నుంచి ఎం.సోమరాజును నల్లజర్ల పీఎస్‌లకు పంపించారు.

Updated Date - Oct 20 , 2024 | 01:34 AM