Share News

2024... ఇక చరిత్ర

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:24 AM

ఇక 2024 లో మిగిలింది కొన్ని గంటలే.. 2024 కలిపితే 8.. ఏ 8లో ఉన్నామో చూసుకునే సమయం వచ్చేసింది.. ఓటరు అనుకున్నది సాధించాడు.. కూటమిని గెలిపించాడు.. సూపర్‌ సిక్స్‌లో ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చింది. వైసీపీని జీరో చేసింది.. మద్యం పాలసీ మార్చింది..

2024... ఇక చరిత్ర

  • మరలిరాని క్షణాలు.. చెరిగిపోని జ్ఞాపకాలు

  • ఓటు విలువ చాటిన ఏడాది

  • కూటమి విజయఢంకా

  • శపథం చేసి గెలిచిన పవన్‌

  • జిల్లాలో వైసీపీ జీరో

  • మూడు మంత్రి పదవులు

  • తుఫాన్‌లు.. విషాదాలు

  • ఏడాదికి మిగిలింది గంటలే

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. దర్శకుడు త్రివిక్రమ్‌ అత్తారింటికిదారేది సినిమాలో రాసిన డైలాగ్‌ ఇది. ఈ ఏడాది ఆ డైలాగ్‌నే నిరూపించింది.. గతేడాది చంద్రబాబును జైలులో పరామర్శించి పొత్తు పెట్టుకుని తగ్గిన పవన్‌.. ఈ ఏడాది ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ తలపడి.. కాచుకో జగన్‌ అంటూ శపథం చేసి మరీ గోదావరి జిల్లాల్లో వైసీపీని తుడిచి పట్టేశారు.. కూటమిని విజయపతాకాన చేర్చారు.. పిఠాపురాన నెగ్గి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఇక 2024 లో మిగిలింది కొన్ని గంటలే.. 2024 కలిపితే 8.. ఏ 8లో ఉన్నామో చూసుకునే సమయం వచ్చేసింది.. ఓటరు అనుకున్నది సాధించాడు.. కూటమిని గెలిపించాడు.. సూపర్‌ సిక్స్‌లో ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చింది. వైసీపీని జీరో చేసింది.. మద్యం పాలసీ మార్చింది.. ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది.. జిల్లా నలు దిక్కులా అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.ఒక్కసారి 12 నెలలు వెనక్కు వెళితే ఈ ఏడాది బాధకంటే ఆనందమే ఎక్కువ.. మరలిరాని క్షణాలు మననం చేసుకుందాం.. కొత్త ఏడాది 2025కి స్వాగతం చెబుదాం..

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

కరిగిపోయే కాలంలో మిగిలిపోయే జ్ఞాప కా లు ఎన్నో ఉంటాయి. అందులో కొన్ని సంతో షాన్నిస్తే..మరికొన్ని విషాదాన్ని నింపుతాయి.. మరికొన్ని మనసును పిండేస్తే..ఇంకొన్ని భయాం దోళనలకు గురిచేస్తాయి. ఇవన్నీ ఒక్క ఏడాది లోనే చోటు చేసుకుంటే అదే 2024. మరికొన్ని గంటల్లో చరిత్ర పుటల్లో కలిసి పోనున్న 2024 ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఉగాది పచ్చడిలా అన్ని రకాల భావోద్వేగాలను పం చింది.ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తోన్న ప్రజా కంటక పాలనకు చరమగీతం పలికి తూర్పు గోదావరి జిల్లా ప్రజలను సంబరాలు చేసుకు నేలా చేసిందీ ఏడాది.పిల్లాపాపలతో ప్రతి ఒక్క రూ రోడ్డెక్కి కూటమి విజయాన్ని తమ విజ యంగా పండుగ చేసు కున్న ఈ ఏడాదిగా ప్రతి ఒక్కరిలో తీపి జ్ఞాపకాలు పంచింది. అటు అవ్వా తాతలకు పింఛన్‌ పెరిగి మోముపై చిరున వ్వులు పూయించగా, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ చేతికి అందడంతో పేద,మధ్య తరగతి ప్రజల్లో ఆనందాలు మిన్న ంటాయి.అటు ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో వర్షాలు, గోదా వరి,ఏలేరు వరదలతో ఉమ్మడి జిల్లా చిగురు టాకులా వణికి పోయింది.దారి తప్పిన పులులు రాజమ హేంద్రవరం,ప్రత్తిపాడులో సంచరిస్తూ కొన్ని వారాలను జనాలను బెంబేలెత్తించింది ఈ ఏడా ది లోనే.అటు సీజ్‌ ద షిప్‌ అన్న పవన్‌ వ్యాఖ్య లతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పేరు మార్మోగి పో యింది. అదే సమయంలో సంచలనాత్మ కమైన వరుస హత్యలు,రక్తపుటేరులు పారిం చిన రోడ్డు ప్రమాదాలు.. జేబులు గుల్ల చేసే సిన సైబర్‌ నేరాలు ఉమ్మడి జిల్లాను కలవర పెట్టా యి. అటు అఖండ గోదావరికి ఇన్నేళ్లకు రూ.100 కోట్లు మంజూరై హేవలాక్‌ వంతెన రూపు మార్చు కోబోతుండడం, శుచి, శుభ్రతలో అన్న వరం ప్రసాదానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం అందరినీ ఆనందపరిచాయి.

ఎంత సంతోషమో..

వైసీపీ ఐదేళ్ల పాలనకు విముక్తి కలి గించి ఉమ్మడి జిల్లా ప్రజలకు సాం త్వన చేకూర్చి సంతోషాన్ని మిగి ల్చి న ఏడాదిగా 2024 అందరికీ గుర్తుం డి పోనుంది.పన్నుల వాత..ఛార్జీల మో త.. సోషల్‌ మీడియా పేరుతో అరెస్టులు.. ప్రజ ల వారసత్వ ఆస్తులు లాగేసుకునేలా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌లతో ఉమ్మడి జిల్లా ప్రజలకు వైసీపీ కం టిపై కునుకు లేకుండా చేసింది. ఈ ప్రజాకంటక పాలనకు ఈ ఏడాది మేలో వచ్చిన అసెంబ్లీ ఫలితాలతో ఒక్కసారిగా ప్రజ ల్లో ఆనందం కట్టలు తెచ్చేకునేలా చేసింది. ఇన్నేళ్ల నరక యాతనకు ముగింపు పలికిం దన్న సంతోషం ఉమ్మడి జిల్లాలో పెల్లుబికింది. మొత్తం అన్ని అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఓడిపో వడంతో జిల్లాలో సంబరాలు మిన్నంటా యి. అటు కూటమి ప్రభుత్వం రాగానే ఎప్పుడూ లేని విధంగా వరుస నామినేటెడ్‌ పదవుల పందేరంతో ఉమ్మడి జిల్లాలో మూడు పార్టీల నేతలు,కార్యకర్తల్లో సంతోషం తొణకిసలాడింది. దాదాపు అన్ని నియోజకవర్గాలకు పదవులు దక్కడంతో నేతలు సంబరాలు చేసుకున్నారు.

అభివృద్ధి దిశగా..

అఖండ గోదావరి ప్రాజెక్టు కింద దాదాపుగా రూ.100 కోట్లు రాజమహేం ద్రవరానికి నిధులు మంజూరవడం గోదావరి వాసులను పులకరింప చేసింది. గోదావరిపై ఉన్న హేవ్‌లాక్‌ వంతెన ఆఽధునికీకరణకు అడుగులు పడడంతో పర్యాటక ప్రియులకు సంతోషం పం చింది.అన్నవరం ప్రసాదానికి జాతీయస్థాయిలో మరో సారి గుర్తింపు లభించిందీ ఈ ఏడాదిలోనే. సుచి,శుభ్రతలో భారత ఆహార ప్రమాణాల సంస్థ గుర్తింపు ఇవ్వడం భక్తులను ఆనందపరిచింది.

పింఛన్‌..పెంచెన్‌..

ఒక్కసారిగా పింఛన్‌ డబ్బులు పెరగ డంతో ఆయా వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. సూపర్‌సిక్స్‌ పథకం అమల్లో భాగంగా దీపా వళికి ఉచితగ్యాస్‌ సిలిండర్‌ను కూటమి ప్రభుత్వం అం దించడంతో మహిళల్లో ఆనం దం వెల్లివిరిసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికన వచ్చే ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తేల డంతో మహిళల ఆనందానికి అంతు లేకుండా పోయింది. మరోపక్క మద్యం దుకాణాలు బడా వ్యాపారుల చేతుల్లోనే ఉంటాయన్న నానుడికి చరమగీతం పాడి కూటమి ప్రభుత్వం లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించడంతో ఉమ్మడి జిల్లాలో అతి సామాన్యులు, పేదలకు జాక్‌పాట్‌ తగిలింది.

జీవితాల్లో పెను తుఫాన్‌

ఈ ఏడాది ఉమ్మడి జిల్లాకు సంతోషంతోపాటు దుఃఖాన్ని పంచింది. ప్రధానంగా ఎడతెరిపి లేని వర్షాలు, తుఫాన్‌లు ప్రజలను నానా ఇబ్బందులు పెట్టాయి. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలు, గోదావరి, ఏలేరు వరదలైతే వారాల తరబడి ప్రజలను బెంబేలెత్తించాయి.ఒక్క ఏలేరు వరద ధాటికే రూ.172 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కగట్టారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మరణం ఎందరినో కలచివేసి విషాదంలోకి నెట్టింది.

ఎంత విషాదమో..

ఈ ఏడాది సంచలనాత్మక హత్యలు, ఇతర నేరాలు, రోడ్డుప్రమాదాలు, సైబర్‌ నేరాలు ఉమ్మడి జిల్లాలో ఎంతో విషాదం నింపాయి.ప్రధానంగా దీపావళి రోజు కాజూలూరు మండలం శల పాక లో చోటుచేసుకున్న మూడు హత్యలు ఉమ్మడి జిల్లాను ఉలిక్కిపడేలా చేశాయి.ఆ తర్వాత డిసె ంబరులో సామర్లకోట మండలం వేట్ల పాలెంలో మూడు హత్యలు మళ్లీ భయ పెట్టా యి.ఈ రెండు నేరాల్లోను కత్తులు, గునపా లతో ప్రత్య ర్థులను పొడిచి చంపిన తీరు ప్రత్యర్థులు నేర స్వభావాన్ని చూపింది. రాజమ హేంద్రవరం సమీపంలో రేవ్‌పార్టీ వ్యవహారం బయటపడ డంతో అంతా ఉలిక్కిపడ్డారు. మారే డు మిల్లిలో విహారయాత్రకు వచ్చి జలపాతంలో ఏలూరుకు చెందిన ముగ్గురు వైద్యవిద్యార్థినులు గల్లంతై ఆ తర్వాత చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో సుమారు 800 వరకూ మృత్యువాత పడడం ఆయా కుటుంబాల్లో వేదన మిగిల్చింది.

కాకెత్తిన కాకినాడ

ఈ ఏడాదిలో ఒకే ఒక్క మాట ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కాకి నాడ పేరు మార్మోగేలా చేసింది. అదే స్టెల్లా నౌక.బియ్యం లోడింగ్‌ కోసం వచ్చిన నౌకలో రేషన్‌ బియ్యం పట్టుబడడంతో డిప్యూ టీ సీఎం పవన్‌ కాకినాడకు వచ్చి సీజ్‌ ద షిప్‌ అన్నారు.ఈ డైలాగ్‌ విపరీతంగా వైరల్‌ అయి ంది.దీనికి తగ్గట్టుగా కాకినాడ పోర్టు చరిత్రలో ఎప్పుడలేని విధంగా ఏకంగా 50 రోజులకు పైనే షిప్‌ నిలిచిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ పేరును మార్మోగేలా చేసింది. అటు రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ వ్యవ హారంలోను కాకినాడ పోర్టు పేరు మోతె క్కింది.ఇక్కడి నుంచి విదేశాలకు తరలి పోయిన పేదల బియ్యం అంశం కొన్ని వారాలపాటు చర్చనీ యాంశంగా మారింది.కాకినాడ సీపోర్టులో వాటాలను వైసీపీ నాయకులు గన్‌ పెట్టి బెదిరించి రాయించేసుకు న్నారన్న కేవీరావు ఫిర్యాదుతో మరోసారి తూర్పుగోదావరి జిల్లా పేరు చర్చనీయాంశం అయ్యేలా చేసింది.

వావ్‌ అనిపించేలా

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను అనేక మంది దేశరాజధాని ఢిల్లీకి వివిధ పనులపై వెళతారు.కానీ జిల్లా నుంచి నేరుగా విమానం లేదు. కానీ 2024 ఏడాది జిల్లావాసులకు ఆ లోటు తీర్చే సింది. రాజమహేంద్రవరం ఎయి ర్‌పోర్టు నుంచి నేరుగా ఢిల్లీకి ఇండిగో డిసెం బర్‌ నుంచి సర్వీ సులు ప్రారంభించింది. ఒకరకంగా జిల్లా ప్రజలకు ఇది తీపికబురు. అటు కాకినాడలో కొత్త ఎయిర్‌ పోర్టు, తుని- అన్నవరం మధ్య ఎయిర్‌పోర్టు లేదా ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మాణం చేస్తామని ప్రభుత్వం ప్రక టించడంతో సర్వత్రా విమాన ప్రయాణి కు లకు కిక్‌ ఇచ్చి వావ్‌ అనిపించింది. కాకినాడలో డిసెంబర్‌లో నకిలీ పిస్టల్‌ను గురి పెట్టి ఓ జ్యూయలరీ దుకా ణంలో బంగారం చోరీ చేసి పారిపోతున్న నింది తుడిని పోలీ సులు సినిమా ఫక్కీలో ఛేజ్‌ చేసి పట్టుకుని వావ్‌ అనిపించుకున్నారు.అన్నవరం లోను ఇలాగే బంగారంతో పారిపోతున్న ఓ నింది తుడిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.

భయపెట్టిన పులులు..

ఈ ఏడాది పులుల సంచారం ఉమ్మడి జిల్లా ప్రజలకు కంటిపైకునుకు లేకుండా చేశాయి. సెప్టెంబరులో రాజమహేంద్రవరం దివాన్‌చెరువు సమీపంలో పులి అడుగు జాడలు రాజమ హేంద్ర వరం వాసులను బెంబేలెత్తించాయి. కొన్ని వారాల పాటు పులి సంచారం ప్రజలను పరు గులు తీయించింది. బయటకు వస్తే ఏమవు తుందోననే భయంతో బిక్కుబిక్కుమన్నారు. ఆ పులి ఏమైందో తెలియదు కానీ..ఆ తర్వాత డిసెంబరులో ప్రత్తిపాడులో పులి సంచారం ప్రచారం జిల్లాను వణికించింది.

జనవరి నెల

జనవరి 3: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బంధపురం వద్ద రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతిచెందారు.

జనవరి 6: దివాన్‌చెరువు గైట్‌ క్యాంపస్‌లో రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

జనవరి 10: అల్లూరి జిల్లాలోని రంపచోడవరంలోని ఐ.పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వాగులో మునిగి రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి

జనవరి 24: అనపర్తి మండలం రామవరం శివారు రామదాసు పుంత రోడ్డులో రాయవరం వెళ్లే దారిలో రోడ్డు పక్కనే గుడిసె వేసుకుని జీవిస్తున్న జంట అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడం సంచలనంగా మారింది.

జనవరి 25: ఉమ్మడి తూర్పు జిల్లాలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించి చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

జనవరి 28: అమలాపురం రూరల్‌ మండలం పిల్లావారి గరువునుంచి అల్లవరం మండలం బోడసకుర్రు వెళ్తున్న భార్యాభర్తల మోటారుసైకిల్‌ను మినీవ్యాన్‌ ఢీకొన్న ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

జనవరి 30: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరులో టీడీపీ అధినేత చంద్రబాబు రా..కదలిరా సభ నిర్వహించారు. లక్షలాదిగా జనం తరలివచ్చారు.

ఫిబ్రవరి నెల

ఫిబ్రవరి 1: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల శివారు చౌదరిపురం సమీపంలో గురువారం ఆటో బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరి మృతి

ఫిబ్రవరి 9: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్‌బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. బ్యాంకు వెనుక నుంచి చొరబడిన దుండగులు రూ.25లక్షల నగదు, రూ.50 లక్షల బంగారం అపహరణ.

ఫిబ్రవరి 12: రాజమహేంద్రవరం-భద్రాచలం హైవేపై అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం సమీపంలోని సీతపల్లి వాగులో పడి రంపయర్రంపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

ఫిబ్రవరి 12: కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం యర్రపోతవరం లాకుల వద్ద ఎదురుగా వస్తున్న లారీని బైక్‌ ఢీకొనడంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు.

ఫిబ్రవరి 15: కడియం మండలం కడియపుసావరంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హతమార్చాడు.. ఆపై తానూ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఫిబ్రవరి 19: పి.గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద అదుపుతప్పిన కారు బైక్‌ను ఢీకొట్టి పంటకాల్వలోకి దూసుకుపోయింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ సాహసోపేతంగా ఈ ఏడుగురిని కాపాడాడు.

ఫిబ్రవరి 27: ప్రత్తిపాడు సమీపంలో పాదాలమ్మ గుడివద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై లారీడ్రైవర్లపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

మార్చి నెల

మార్చి 3: కెమెరాలకోసం విశాఖకు చెందిన ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసి జొన్నాడ గోదావరి ఇసుక తిన్నెల్లో పూడ్చిపెట్టిన మూలస్థానం వ్యక్తి.

మార్చి 4: రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు మైనర్లు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కరకవలస సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

మార్చి 12: ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు.

మార్చి 17: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో బొలెరో వ్యాన్‌ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు.

మార్చి 25: కాకినాడ సాగరతీరంలో ఇండో-యుఎస్‌ఏ నావికాదళ విన్యాసాలు అద్భుతంగా జరిగాయి.

మార్చి 30: పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ తొలిరోజు ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.

ఏప్రిల్‌ నెల

ఏప్రిల్‌ 1: గొల్లప్రోలు మండలం దుర్గాడలో ట్యాంకర్‌ పేలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

ఏప్రిల్‌4: గండేపల్లి మండలం తాళ్లూరులో లారీని కారు ఢీకొన్న ఘటనలో బావబామ్మర్దులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఏప్రిల్‌4: తూర్పుగోదావరి జిల్లా పెందుర్తివద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ వ్యాన్‌ ఢీకొని ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఏప్రిల్‌4: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విజయవంతంగా ప్రజాగళం సభ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు

ఏప్రిల్‌ 5: ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన ప్రేమజంట నర్సీపట్నంలో ఆత్మహత్య

ఏపిల్ర్‌11: అమలాపురం, పి.గన్నవరంల్లో చంద్రబాబు, పవన్‌ పర్యటన

ఏప్రిల్‌18: గుర్తుతెలియని వాహనం ఢీకొని పెద్దాపురం-రాజమండ్రి ఏడీబీ రోడ్డులో ఇద్దరు యువకుల దుర్మరణం

ఏప్రిల్‌ 19: వాడపల్లి వెంకన్న కల్యాణం వైభవంగా జరిగింది.

మే నెల

మే 7: రాజమహేంద్రవరంలో టీడీపీ, బీజేపీ, జనసేన సభ.. హాజరైన మోదీ, పవన్‌, లోకేశ్‌

మే 12: వాడపల్లి వెంకన్న ఆలయానికి కాలినడకన వెళ్తూ ఆత్రేయపురంలోని గోదావరి పాయలో ఊబిలో కూరుకుపోయి ఇద్దరు మహిళలతో సహా బాలిక మృతి

మే 13: ఓటెత్తిన జనం.. కోనసీమలో 82.61 శాతం, కాకినాడలో 74.24, తూర్పున 79.43 శాతం పోలింగ్‌

మే 14: పి.గన్నవరం మండలం ఉడిమూడిలో ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మే 18: రావులపాలెంలో ఈత కోసం దిగి గోదావరిలో ముగ్గురు గల్లంతు

మే 21: కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు.

మే 26: జగ్గంపేట రామవరం వద్ద ఓ కారును ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరి మృతి చెందారు.

మే 27: కృష్ణా జిల్లా కోడూరుపాడులో లారీని కారు ఢీకొనగా కొవ్వూరుకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు.

మే 28: అనారోగ్యంతో సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లిఅబ్బాయిరెడ్డి మృతి చెందారు.

జూన్‌ నెల

జూన్‌ 4: కూటమిదే విజయం. గోదారి ఓట్ల వరదలో ఫ్యాన్‌ గల్లంతు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి తూ.గో. జిల్లాలో 22 సీట్లలో వైసీపీ ఘోర పరాజయం

జూన్‌ 12: మూడు జిల్లాలకు ముగ్గురు మంత్రులు.. డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌, కేబినెట్‌లో దుర్గేష్‌, సుభాష్‌లకు చోటు

జూన్‌ 13: అడ్డతీగల మండలం సోమన్నపాలెంలో చెరువులో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.

జూన్‌ 14: కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో కోనసీమలోని ఉప్పలగుప్తం ప్రాంతానికి చెందిన నలుగురు మృతి

జూన్‌ 20: ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అసెంబ్లీలో గౌరవం కల్పించారు.

జూన్‌ 28: కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, తాళ్లరేవుల్లో బియ్యం గోదాముల్లో మంత్రి నాదెండ్ల తనిఖీలు నిర్వహించారు.

జూలై నెల

జూలై 1: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెంచిన పింఛన్లను పిఠాపురంలో ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌

జూలై 1: దివాన్‌చెరువు పరిధిలోని జి.ఎర్రంపాలెంలోని బరోడా బ్యాంక్‌లో రూ.40లక్షల గోల్‌మాల్‌ ఘటన సంచలనం సృష్టించింది.

జూలై 3: పిఠాపురంలో భూమి కొన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

జూలై 9: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపికైన మహిళ హైదరాబాద్‌నుంచి రాజవోలుకు వస్తుండగా ద్వారకాతిరుమల వద్ద ఆగి ఉన్న ట్రాలీ లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు సహా మహిళ మృతి చెందింది.

జూలై 15: ఏటూరునాగారం శివారులో కంటైనర్‌ లారీని ఆటోఢీకొన్న ఘటనలో తొండంగి మండలం కోదాడకు చెందిన మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులు, డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యారు.

ఆగస్టు నెల

ఆగస్టు 4: దివాన్‌చెరువు జీరో పాయింట్‌ వద్ద ఓ వ్యాను ప్రత్యేక అరలో 444 కిలోల పట్టివేత

ఆగస్టు 5: కొవ్వూరు మండలం కుమారదేవంలో నూట 150ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా చెట్టు కూలింది.

ఆగస్టు 6: డబ్బు కోసం పెళ్లిపేరుతో వ్యక్తిని మోసం చేసిన ఆరుగురు కిలాడీ మహిళలపై చీటింగ్‌ కేసు నమోదైంది.

ఆగస్టు 11: ధవళేశ్వరానికి చెందిన ఇద్దరు బాలికలను మోసం చేసి తీసుకెళ్లిపోయిన కేటుగాడిని కనిపెట్టిన పోలీసులు

ఆగస్టు 16: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నక్యాంటీన్లు పునఃప్రారంభం

సెప్టెంబరు నెల

సెప్టెంబరు 5: వరదలతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ... కోనసీమలోనూ వదర ముప్పు.. పంపా రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద

సెప్టెంబరు 6: దివాన్‌చెరువు వద్ద లారీ ఢీకొని ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

సెప్టెంబరు 8: రాజమహేంద్రవరం రిజర్వు ఫారెస్టులో చిరుత సంచారం కలకలం

సెప్టెంబరు 11: ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

సెప్టెంబరు 12: కాకినాడకు చెందిన సీతారాం ఏచూరి కన్నుమూత

సెప్టెంబరు 16: కోనసీమ జిల్లా రావులచెరువులో బాణసంచా పేలుడులో 17మందికి తీవ్రగాయాలు

సెప్టెంబరు 23: అల్లూరి జిల్లా మారేడుమిల్లి జలతరంగణి వాగులో ముగ్గురు మెడికోలు మృతి

అక్టోబరు నెల

అక్టోబరు 4: కాకినాడ రూరల్‌ తూరంగి గ్రామంలో పంట కాలువలోకి ఈతకోసం దిగి ఇద్దరు విద్యార్థుల మృతి

అక్టోబరు 13: అమలాపురంలో దసరా ఉత్సవాల్లో డీజే పాటలకు డ్యాన్స్‌ చేస్తుండగా కుప్పకూలి యువకుడి మృతి

అక్టోబరు 17: హైదరాబాదులో రసాయనాల ట్యాంకులో పడి కాట్రేనికోన మండలం దొంతికుర్రుకు చెందిన కవలల మృతి

అక్టోబరు 19: జనసేనలో చేరిన ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి

అక్టోబరు 22: ఆర్థిక ఇబ్బందులతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటలో దంపతుల ఆత్మహత్య

అక్టోబరు 28: కాకినాడ రూరల్‌ రమణయ్యపేట మార్కెట్‌ సమీపంలో డివైడర్‌ని ఢీకొట్టి ఇద్దరు యువకుల మృతి

అక్టోబరు 28: మండపేట మండలం ఏడిదలో నారబాంబులు చుడుతుండగా పేలుడు సంభవించి భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

అక్టోబరు 29: కాకినాడలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య... ఇంట్లోంచి దుర్వాసన రావడంతో వెలుగులోకి వచ్చిన వైనం

నవంబరు నెల

నవంబరు 1: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉచిత గ్యాస్‌ బుకింగ్‌ ప్రారంభం

నవంబరు 1: కాకినాడ జిల్లా కాజులూరు మండలం శలపాకలో ముగ్గురు దారుణ హత్య

నవంబరు 4: ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం.. నలుగురు యువకుల దుర్మరణం

నవంబరు 8: అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం బొంగరాలపాడు ఏలేరు వాగులో ఇసుక తీస్తుండగా ప్రమాదశాత్తూ మునిగి నలుగురి మృతి

నవంబరు 9: రుడా చైర్మన్‌గా బొడ్డు వెంకట రమణ చౌదరి.. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కుడుపూడి సత్తిబాబు నియామకం

నవంబరు 12: వైసీపీకి కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీవ్‌కృష్ణ రాజీనామా

నవంబరు 22: యూపీఎస్సీ ‘సివిల్‌ ఇంజనీరింగ్‌’లో.. రాజమహేంద్రవరం కుర్రోడికి 12వ ర్యాంక్‌, బొమ్మూరు యువతికి 65వ ర్యాంకు

నవంబరు 26: ఐపీఎల్‌లో గోగన్నమఠం కుర్రోడు.. రూ.30 లక్షల రేటు పలికిన సత్యనారాయణరాజు

డిసెంబరు నెల

డిసెంబరు 4: విలీన మండలాల్లో స్వల్ప భూప్రకంపనలతో బెంబేలెత్తిన ప్రజలు

డిసెంబరు 4: సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా ఉన్న పెందుర్తి వెంకటేశ్‌కి తొలిసారి క్యాబినెట్‌ హోదా కల్పించారు.

డిసెంబరు 9: ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పీడీఎఫ్‌ అభ్యర్థి గోపిమూర్తి గెలుపు

డిసెంబరు 10: పి.గన్నవరం మండలం ఉడిమూడి శివారులో పంట కాల్వలోకి కారు దూసుకుపోయిన ఘటనలో తల్లీ, ఇద్దరు కుమారులు మృతి

డిసెంబరు 12: రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి విమానం సర్వీసులు ప్రారంభం

డిసెంబరు 15: సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇంటి సరిహద్దు వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ముగ్గురి హత్య.. ఏడుగురికి గాయాలు

డిసెంబరు 18: కాకినాడలోని తనిష్క్‌ జ్యూయలరీ షాపులో పిస్టల్‌తో బెదిరించి బంగారం చోరీ

డిసెంబరు 26: కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో చెట్టును బైక్‌ ఢీకొని ఇద్దరు గిరిజనుల మృతి

Updated Date - Dec 31 , 2024 | 01:24 AM