17 రౌండ్లలో ఫలితం
ABN , Publish Date - May 26 , 2024 | 12:52 AM
రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నన్నయ వర్శిటీలో జూన్ 4 జరుగుతుందని ఇందులో మొత్తం 17 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందని ఆర్‌వో, కమిషనర్ దినేష్‌కుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓట్ల లెక్కింపు విధివిధానాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు.
రాజమహేంద్రవరం ఆర్‌వో దినేష్‌కుమార్
రాజమహేంద్రవరం సిటీ, మే 25: రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నన్నయ వర్శిటీలో జూన్ 4 జరుగుతుందని ఇందులో మొత్తం 17 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందని ఆర్‌వో, కమిషనర్ దినేష్‌కుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓట్ల లెక్కింపు విధివిధానాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ఎన్నికల సంఘం నియమావళిని ఖశ్చితంగా పాటించాలన్నారు. జూన్ 1న సాయంత్రం 5 గంటల్లోగా ఏజెంట్ల వివరాలు అందజేసి తగిన ఐడీ కార్డులు పొందాలన్నారు. ఐడీ కార్డుతో పాటు టేబుల్స్ వద్ద ఉండే ఏజెంట్లకు బ్యాడ్జీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రౌండ్ల వారిగా పోలైన ఓట్ల వివరాలు డిస్‌ప్లే బోర్డులో ఉంచుతామన్నారు. ఏజెంట్లు అందరు 4న ఉదయం 6 గంటలలోపు కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవాల న్నారు. రౌండ్ల వారీగా ఫలితాల వివరాలను ఏజెంట్లకు అందజేస్తామన్నారు. వాటిని ఫారం 17 సీతో నిర్ధారణ చేసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీ వరకు ఉంటుందన్నారు. కౌంటింగ్ అనంతరం ఈవీఎంలు సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ కౌంటింగ్‌కు 350 మంది సిబ్బంది
రాజమహేంద్రవరం రూరల్, మే 25: నన్నయ విశ్వవిద్యాలయంలో వచ్చేనెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సిబ్బంది అత్యంత బాధ్యతగా నిర్వహించాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్‌భరత్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపులో 350 మంది సిబ్బందిని, హమాలీలను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ హాలులో ఒక వీడియో గ్రాఫర్ ఏర్పాటు చేస్తామన్నారు. పాస్‌లు ఉన్న వారికే అనుమతులు ఉంటాయన్నారు. సిబ్బంది అందరు ఎన్నికల పాసులు ధరించాలన్నారు. ప్రతి రౌండ్‌కు సంబంధించిన డేటాను టేబుల్‌పై వేసిన తర్వాత పోలైన ఓట్ల సంఖ్య ఓటరు టర్నౌట్ రిపోర్టుకు క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని నిర్ధారించుకుని కౌంటింగ్ టేబుల్స్‌కు అందించాలని, వాటి క్రమ సంఖ్య క్రాస్ చెక్ చేయాలన్నారు. సిబ్బంది చాలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారులు ఐ.సాయిబాబా, తహశీల్దార్లు వైవీకే అప్పారావు, బి.సుజాత, కొండయ్య, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.