Share News

AP Elections: జగన్‌పై రాయి దాడి.. స్పందించిన ధూళిపాళ్ల నరేంద్ర

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:33 PM

ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై రాయి దాడి ఘటనపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పందించారు. ఆదివారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ.. జనాదరణ లేకపోవడంతోనే జగన్నాటకానికి తెర తీశారన్నారు. అందుకే ఈ రాయి దాడి జరిగిన.. కేవలం 10 నిమిషాల్లోనే మంత్రులు, అధికార పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై పోస్టులు పెట్టారని తెలిపారు.

AP Elections: జగన్‌పై రాయి దాడి.. స్పందించిన ధూళిపాళ్ల నరేంద్ర
Dhulipalla Narendra Kumar

గుంటూరు, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై రాయి దాడి ఘటనపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) స్పందించారు. ఆదివారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ.. జనాదరణ లేకపోవడంతోనే జగన్నాటకానికి తెర తీశారన్నారు. అందుకే ఈ రాయి దాడి జరిగిన. కేవలం 10 నిమిషాల్లోనే మంత్రులు, అధికార పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై పోస్టులు పెట్టారని తెలిపారు. కరెంట్ తీసి దాడికి పాల్పడింది అధికార పార్టీ వారేనని ఆయన స్పష్టం చేశారు. డీజీపీతో సహా అధికారులందరూ జగన్‌కు అనుకూలమైన వారేనని ఈ సందర్భంగా నరేంద్ర గుర్తు చేశారు అయితే జగన్‌పై దాడిని అందరూ ఖండించాలన్నారు.

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సానుభూతి కోసమే ఈ దాడి నాటకానికి తెర తీశారని ఆరోపించారు. కోడి కత్తి కేసులో టిడిపి పాత్ర లేదని ఇప్పటికే ఎన్ఐఎ నిర్ధారించిందని ఈ సందర్భంగా చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని గతంలో ఆరోపణలు గుప్పించారని.. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఆ కేసులో ఇంత వరకు విచారణ ప్రారంభం కాలేదన్నారు.


మొన్న కోడి కత్తి డ్రామా? ఇప్పుడు రాయి డ్రామానా? అని నరేంద్ర వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలున్నా వైసిపి వాళ్ళు రహదారులపైకి వచ్చి నిరసనలు చేశారని వెల్లడించారు. రానున్న ఎన్నికలలో సానుభూతి కోసమే ఈ డ్రామా అని ఆయన అభివర్ణించారు. ఈ దాడులు అధికారుల వైఫల్యమేనని స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు కూడా ఇంకా అధికారంలో వున్నామనే భ్రమలో ఉండి.. దాడులకు పాల్పడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

Politics: డిఫెన్స్‌లో వైసీపీ.. చంద్రబాబుపై దుష్ప్రచారం.. కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్.

ఓటమి భయంతోనే దాడి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏదో విధంగా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే ఈ విధమైన ఆలోచనలు చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల కుట్రలతో వైసీపీ నాయకులను రెచ్చగొట్టి వర్గ వైషమ్యాలతో ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రాయి దాడి డ్రామాకు తెర తీశారని వైయస్ జగన్‌పై నరేంద్ర నిప్పులు చెరిగారు.


మేము సైతం సిద్దం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైయస్ జగన్ విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఏప్రిల్ 13 రాత్రి స్థానిక సింగ్ నగర్ ప్రాంతంలో వైయస్ జగన్‌పై ఆగంతకులు రెండు రాళ్లు విసిరారు. ఒక రాయి వైయస్ జగన్‌కు తగిలితే.. మరో రాయి ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు తగిలింది. ఈ ఘటనలో వైయస్ జగన్‌కు తగిలిన గాయానికి మూడు కుట్లు వేశారు.

అదీకాక గత ఎన్నికల వేళ.. ఇదే వైయస్ జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కోడి కత్తి దాడి జరిగింది. ఈ దాడి నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడే చేయించారంటూ.. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన లబ్ది పొందిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి అధికారాన్ని అందుకోవడానికి వైయస్ జగన్ మళ్లీ అదే తరహాలో నాటకానికి తెర తీశారనే ఓ ప్రచారం అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

ఏపీ వార్తలు కోసం..

Updated Date - Apr 14 , 2024 | 03:33 PM