Share News

CM Jagan: ఇన్‌చార్జుల మార్పుపై జగన్ కసరత్తు

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:49 PM

పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పుపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలకు పిలుపు వెళ్లింది.

CM Jagan: ఇన్‌చార్జుల మార్పుపై జగన్ కసరత్తు

అమరావతి: పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పుపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలకు పిలుపు వెళ్లింది. ఈ క్రమంలోనే సీఎం క్యాంపు కార్యాలయానికి అమలాపురం(ఎస్సీ) ఎంపీ చింత అనురాధ, మరోసారి చిత్తూరు (SC) ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు వచ్చారు. అలాగే ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం తన సీటు కోసం మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

అలాగే మంత్రి బొత్స సత్య నారాయణ సైతం తన సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ స్థానం కోసం మాట్లాడేందుకు విజయనగరం వచ్చారు. మరోసారి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. డోన్ నుంచి మరోసారి పోటీ చేసేందుకు బుగ్గన మంతనాలు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వచ్చారు. ముందుగా ప్రాంతీయ సమన్వయకర్తలను కలసి చర్చించాక అవసరం మేరకు సీఎం జగన్‌ను నేతలు కలిస్తున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 03:07 PM