AP News: చీరాల, వేటపాలెం మండల్లాలోని బీచ్‌ల మూసివేత..
ABN , Publish Date - Jun 24 , 2024 | 01:18 PM
చీరాల, వేటపాలెం మండల్లాలోని బీచ్‌లను పోలీసులు మూసి వేశారు. సముద్రాన్నికి వెళ్ళే మార్గాలలో బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత పది రోజుల కాలంలో రామాపురం, వాడరేవు తీరాల్లో 9 మంది యువకులు మృతి చెందారు. వరుస మరణాల నేపథ్యంలో పర్యాటకులు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
బాపట్ల: చీరాల, వేటపాలెం మండల్లాలోని బీచ్‌లను పోలీసులు మూసి వేశారు. సముద్రాన్నికి వెళ్ళే మార్గాలలో బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత పది రోజుల కాలంలో రామాపురం, వాడరేవు తీరాల్లో 9 మంది యువకులు మృతి చెందారు. వరుస మరణాల నేపథ్యంలో పర్యాటకులు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరానికి వచ్చిన ఇద్దరు యువకులు మృతి చెందారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని బార్గవపేటకు చెందిన పది మంది యువకులు బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. తోటి స్నేహితులు గాలించి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారిద్దరు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇలా కేవలం పది రోజుల వ్యవధిలోనే 9 మంది యువకులు మృతి చెందారు. దీంతో అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యారు. వరుస ఘటనల నేపథ్యంలో పర్యాటకులకు అనుమతి నిరాకరించారు.