Share News

AP News: మరో కేసులో చంద్రబాబు పేరుని చేర్చిన సీఐడీ.. ఈసారి ఏ కేసులో అంటే?

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:05 PM

మరో కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పేరుని సీఐడీ చేర్చింది. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబును ఏ-40గా సీఐడీ చేర్చింద. ఈ మేరకు నేడు (సోమవారం) ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చుతూ అదనపు సీఐడీ అదనపు మెమో దాఖలు చేసింది. మరో రెండు అసైన్డ్ భూముల కేసులో సీఐడీ అధికారులు ఒకే చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో రెండు కేసులకు ఒకే ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

AP News: మరో కేసులో చంద్రబాబు పేరుని చేర్చిన సీఐడీ.. ఈసారి ఏ కేసులో అంటే?

అమరావతి: మరో కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పేరుని సీఐడీ చేర్చింది. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబును ఏ-40గా సీఐడీ చేర్చింద. ఈ మేరకు నేడు (సోమవారం) ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చుతూ అదనపు సీఐడీ అదనపు మెమో దాఖలు చేసింది. మరో రెండు అసైన్డ్ భూముల కేసులో సీఐడీ అధికారులు ఒకే చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో రెండు కేసులకు ఒకే ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసులు రెండు అసైన్డ్ భూములకు చెందినవేనని సీఐడీ న్యాయవాదులు చెప్పారు. ఈ కేసులో గతంలోనే మాజీమంత్రి నారాయణను నిందితుడిగా చేర్చారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు 3 రోజులు ముందు ప్రభుత్వం చార్జిషీట్ వేసిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబుపై కక్షతోనే అని పేర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబును మరో కేసులో చేరుస్తూ మండిపడుతున్నారు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని టీడీపీ నేతలు చెప్పాలి.

Updated Date - Mar 11 , 2024 | 10:05 PM