Share News

ఓటు నమోదుకు యువత ఆసక్తి

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:00 AM

జిల్లాలో శని, ఆదివారాల్లో ఓటు నమోదు, సవరణ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు నిండే యువత ఓటు నమోదుకు ఆసక్తి చూపారు.

ఓటు నమోదుకు యువత ఆసక్తి
ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న బీఎల్వోలు

ఫ 1,019 మంది దరఖాస్తు

ఫ రెండు రోజుల్లో అందిన క్లెయిమ్‌లు 2,435

తిరుపతి, కలెక్టరేట్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శని, ఆదివారాల్లో ఓటు నమోదు, సవరణ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు నిండే యువత ఓటు నమోదుకు ఆసక్తి చూపారు. ఈ రెండు రోజుల్లో 1,019 యువ ఓటర్లు నమోదుకు ఆసక్తి చూపారు. ఇక, రెండో రోజు ఓటర్ల నమోదు, సవరణకు 2,141 పోలింగ్‌ కేంద్రాల్లోని బీఎల్వోలకు 1,392 క్లెయిమ్‌లు అందాయి. ఇందులో ఓటు నమోదుకు 550 దరఖాస్తులు రాగా.. విదేశాల్లోని 90 మంది ఓటు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఓటర్ల జాబితాల్లో పేర్ల తొలగింపునకు 362, ఓటు బదిలీ, సవరణకు 390 క్లెయిమ్‌లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇలా రెండు రోజుల్లో 2,435 క్లెయిమ్‌లు అందాయి. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్వోలు గైర్హాజరైనట్లు సమాచారం. వారిపై అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

Updated Date - Nov 25 , 2024 | 02:00 AM