Share News

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు

ABN , Publish Date - May 17 , 2024 | 02:14 AM

ఓటమి భయంతోనే కూటమి నాయకులపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని పశ్చిమగోదావరి జిల్లా ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు

- రఘురామకృష్ణంరాజు

రేణిగుంట, మే 16: ఓటమి భయంతోనే కూటమి నాయకులపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని పశ్చిమగోదావరి జిల్లా ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విమర్శించారు. గురువారం తిరుపతి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌, సజ్జల మాటల్లో ధ్వనిస్తున్న వణుకు వారి ఆందోళనను చాటుతోందన్నారు. వారి ముఖ కవళికలు చూస్తే స్పష్టంగా ఓటమి అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఈ 15రోజులూ కేడర్‌లో జోష్‌ను నింపేందుకు 150 స్థానాలు స్థానాలు గెలుస్తున్నామని వైసీపీ నేతలు చెబుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిసున్నారన్నారు. కూటమి 1994లో కన్నా 130, 135 స్థానాలు విజయం సాధిస్తుందన్నారు. 150 స్థానాలు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ఆయన చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిని పరామర్శించేందుకు వెళ్లారు.

Updated Date - May 17 , 2024 | 02:14 AM