Share News

ఏమి కరెక్టు చేసినట్లు?

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:19 AM

ముసాయిదా ఓటర్ల జాబితాలోని తప్పులను అధికారులు ఏమాత్రం సరిచేశారో తెలియదు. తుది జాబితాలోనూ అవే తప్పులు కనిపిస్తున్నాయి.

ఏమి కరెక్టు చేసినట్లు?
జాబితాలో ఉన్న మృతుల పేర్లు

ఓటర్ల తుది జాబితాలోనూ తప్పులే

సదుం, జనవరి 31: ముసాయిదా ఓటర్ల జాబితాలోని తప్పులను అధికారులు ఏమాత్రం సరిచేశారో తెలియదు. తుది జాబితాలోనూ అవే తప్పులు కనిపిస్తున్నాయి. ఒకే ఇంట్లో కాపురం ఉంటున్న భార్యాభర్తలకు సంబంధించి.. వేర్వేరు వీధుల్లో నివాసం ఉంటున్నట్లు జాబితాలో చిరునామాలు ఉండడం సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. సదుంలోని 82వ పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి ఓటర్ల జాబితాలో కొన్నింటిని పరిశీలిస్తే.. సీరియల్‌ నెం.239లో వీరబొమ్మల శారదమ్మ, 301లో రాజంపేట మహేశ్‌ కుమార్‌, 716లో వీరమల్లయ్యగారి కృష్ణమూర్తి, 96లో లద్దిగం చంద్రయ్య, 99లో లద్దిగం లక్ష్మమ్మ మృతి చెందారు. అయినప్పటికీ వీరిని ఓటర్లుగానే ఉంచారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఉద్యోగ, వ్యాపార, జీవనోపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన వారూ ఓటర్లు జాబితాలో ఉన్నారు. నివాసాల అసలు చిరునామాలు కాక ఎక్కడో వేర్వేరు వీధుల్లో ఉంటున్నట్లు ఉన్న చిరునామాలు విమర్శలకు తావిస్తోంది. సీరియర్‌ నెంబరు, పేరు, చిరునామా ఉండి ఫొటో లేని తప్పులు ఎక్కువే.

Updated Date - Feb 01 , 2024 | 12:19 AM