Share News

పట్టుకుంది మేమే.. అయినా పూర్తి వివరాలు తెలియదు

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:29 AM

‘కోడిపందేల స్థావరంపై దాడిచేసి పట్టుకుంది మేమే. అయితే వారి వివరాలు మాత్రం మాకు ఇంకా తెలియదు’ అని పోలీసులు చెప్పుకొచ్చారు.

పట్టుకుంది మేమే.. అయినా పూర్తి వివరాలు తెలియదు
పట్టుబడ్డ వారిని మీడియాకు చూపుతున్న సీఐ, సిబ్బంది

కోడి పందేల వ్యవహారంపై పోలీసుల మాట

గంగాధరనెల్లూరు, ఏప్రిల్‌ 11: ‘కోడిపందేల స్థావరంపై దాడిచేసి పట్టుకుంది మేమే. అయితే వారి వివరాలు మాత్రం మాకు ఇంకా తెలియదు’ అని పోలీసులు చెప్పుకొచ్చారు. గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె గ్రామానికి సమీపంలో గురువారం కొంతమంది వ్యక్తులు కోడి పందేలు ఆడుతున్నారని పోలీసులుకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐ శంకర్‌ తన సిబ్బందితో కలిసి కోడి పందేల స్థావరంపై దాడిచేశారు. అక్కడ డబ్బు, కోడిపుంజులు, ద్విచక్ర వాహనాలు, పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని ఫొటో దిగారు. వీరందరినీ సాయంత్రం 5.30 గంటలకు తీసుకువచ్చారు. ఈ కేసు విషయంపై గురువారం రాత్రి 9.12 గంటలకు సీఐ శంకర్‌కు ఫోన్‌చేసి వివరాలు అడగ్గా. ఏడు పందెం కోళ్లు, రూ.11వేల నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 6 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల పేర్లు మాత్రం ఇంకా తెలియదని సీఐ పేర్కొన్నారు. సుమారు 4గంటలకు పైగా స్టేషన్‌లో పందెం రాయుళ్లను పెట్టుకున్నప్పటికీ వారి గురించి వివరాలు తెలియదని చెప్పడం గమనార్హం.

Updated Date - Apr 12 , 2024 | 12:29 AM