Share News

పులిచెర్ల మండలంలో వలంటీరు తొలగింపు

ABN , Publish Date - Mar 21 , 2024 | 12:47 AM

పులిచెర్ల మండలంలో ఈనెల 17న వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్ర వాహన ర్యాలీలో కల్లూరు పంచాయతీకి చెందిన వలంటీరు ఖాదర్‌బాషా పాల్గొనడంపై అధికారులకు ఫిర్యాదు అందింది.

పులిచెర్ల మండలంలో వలంటీరు తొలగింపు
ర్యాలీలో క్షేత్రసహాయకుడు ప్రసాద్‌ పాల్గొన్నట్లు టీడీపీ నాయకులు ఇచ్చిన ఫొటో

ఉపాధి క్షేత్రసహాయకుడిపై విచారణ నివేదిక అందజేత

కల్లూరు, మార్చి 20: పులిచెర్ల మండలంలో ఈనెల 17న వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్ర వాహన ర్యాలీలో కల్లూరు పంచాయతీకి చెందిన వలంటీరు ఖాదర్‌బాషా పాల్గొనడంపై అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఇదే ర్యాలీలో పాల్గొన్న దిగువపోకలవారిపల్లి పంచాయతీకి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకుడు ప్రసాద్‌పైనా టీడీపీ నాయకులు సీ-విజిల్‌, ఎంపీడీవోకు బుధవారం ఫిర్యాదు చేశారు. క్షేత్రసహాయకుడు ప్రసాద్‌ని ఎంపీడీవో విచారించి రాతపూర్వకంగా సంజాయిషీని తీసుకున్నారు. ఈ విచారణ నివేదికను డ్వామా పీడీ రాజశేఖర్‌కు పంపామని ఎంపీడీవో తెలిపారు. కాగా, ఇదే ర్యాలీకి సంబంధించి అందిన ఫిర్యాదులపై ఇప్పటికే వెంకటదాసరపల్లి పంచాయతీకి చెందిన ఇద్దరు వలంటీర్లను తొలగించగా, అయ్యావాండ్లపల్లి పంచాయతీకి చెందిన ఉపాధిహామీ పథకం క్షేత్రసహాయకుడిపై ఉన్నతాధికారులకు మంగళవారం ఎంపీడీవో నివేదిక అందించారు.

Updated Date - Mar 21 , 2024 | 12:47 AM