సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకాల మరణం
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:06 AM
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు గుండెపోటుతో మృతి చెందాడు. పుట్టిన రోజు నాడే ఈ సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
- పుట్టిన రోజునాడే గుండెపోటుతో మృతి
గంగాధరనెల్లూరు, మార్చి 2: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు గుండెపోటుతో మృతి చెందాడు. పుట్టిన రోజు నాడే ఈ సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు (దిగవూరు)కు చెందిన విశ్రాంత జడ్పీ సీఈవో సుధాకర్ పిళ్ళై కుమారుడు సుధీర్ (40) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పి.. కొంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని నిద్రపోయాడు. శనివారం తెల్లవారు జామున ఆయన భార్య నిద్రలేపడానికి ప్రయత్నించగా శరీరం చల్లబడిపోయి ఉంది. వెంటనే ఆమె ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుధీర్‌కి శనివారం పుట్టినరోజు కావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. బిడ్డ ఇకలేడన్న విషయం తెలియడంతో గంగాధరనెల్లూరులోని సుధాకర్ పిళ్ళై రోదనలు మిన్నంటాయి.